హెరాల్డ్ సెటైర్ : ఉచిత విద్యుత్ కోసం చంద్రబాబు ఉద్యమాలు చేశాడా ? ఎవరైనా నమ్ముతారా ?
తాజాగా సెలవిచ్చిన ఉచిత విద్యుత్ కోసం ఉద్యమాలు చేయటం కూడా ఇందులో భాగమనే అనుకోవాలి. తాను చేసింది చెప్పుకోవటం ఒక ఎత్తైతే ప్రత్యర్ధుల విజయాలను కూడా తన ఖాతాలో వేసేసుకుని ప్రచారం చేసుకోవాలంటే ఎంతటి తెగింపు కావాలో ? ఉమ్మడి రాష్ట్రంలో నిర్మితమైన హైటెక్ సిటి ఎవరి హయాంలో వచ్చిందంటే ఎవరైనా ఎన్టీయార్ పేరో లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరో చెబుతారా ? హైటెక్ సిటి చంద్రబాబు హయాంలోనే ఏర్పడిందన్నది ఎంతటి సత్యమో వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ ఇచ్చింది కూడా దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ అనేది అంతే సత్యం. ఉచిత విద్యుత్ కోసం తానే పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించినట్లుగా చంద్రబాబు బిల్డప్ ఇవ్వటమే చాలా విచిత్రంగా ఉంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రకటనపై వైసిపి, కాంగ్రెస్ నేతల నుండి తీవ్రమైన నిరసన మొదలవ్వగానే వెంటనే మార్చేశాడు. ఉచిత విద్యుత్ వైఎస్ క్రెడిట్ కాదని రైతులే ఉద్యమాలు చేసి సాధించుకున్నారంటూ మాట మార్చాడు.
రైతులు ఉద్యమాలు చేసింది పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించమని. అంతేకానీ ఎవరు కూడా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వమని అడగలేదు. అయితే ఛార్జీలు తగ్గించమని అడగటాన్ని కూడా సహించలేని చంద్రబాబు ఉద్యమకారులపై కాల్పులు జరిపించాడు. పోలీసుల కాల్పుల్లో నలుగురు ఉద్యమకారులు మరణించిన తర్వాత వైఎస్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుందని, అప్పటి వరకు కట్టాల్సిన బిల్లును మాఫీ చేస్తుందంటూ ప్రకటించాడు. చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే వ్యవసాయానికి ఉచిత విద్యుత్+ బిల్లులను వైఎస్ మాఫీ చేశాడన్న విషయం ప్రపంచానికంతా తెలుసు. వైఎస్ హామీని అప్పట్లో చంద్రబాబు ఎంతగా ఎద్దేవా చేసింది కూడా ప్రపంచం చూసింది. ఎప్పుడైతే ఇచ్చిన హామీని వైఎస్ అమలు చేసి చూపాడో తర్వాత ఎన్నికల్లో తాను కూడా అదే హామీని చంద్రబాబు ఇచ్చాడు. అయితే చంద్రబాబును జనాలెవరు నమ్మలేదు లేండి.