హెరాల్డ్ సెటైర్ : పవన్ గాలి తీసేసిన సొంతపార్టీ ఎంఎల్ఏ రాపాక .. గాలిలో కలిసిపోయేదేనట
రాపాక గెలవటం, వైసిపి కూడా బంపర్ మెజారిటితో అధికారంలోకి రావటంతో రాపాక అనధికారికంగా అధికారపార్టీ ఎంఎల్ఏగానే తిరిగేస్తున్నాడు. ఇదే విషయాన్ని పవన్ను మీడియా అడిగినపుడు ’ఎంఎల్ఏ రాపాక ఏ పార్టీలో ఉన్నాడే ఆయన్నే అడగండి’ అంటూ ఇచ్చిన సమాధానం అందరికీ గుర్తుండే ఉంటుంది. గెలిచిన దగ్గర నుండి రాపాకకు పవన్ కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చింది లేదు. పార్టీ తరపున నియమించిన అన్నీ కమిటీల్లో రాపాకను సభ్యునిగా నియమించలేదు. గెలిచిన ఏకైక ఎంఎల్ఏ రాపాకనే కాబట్టి ప్రతి కమిటిలోను సభ్యునిగా నియమిస్తే ఆయనకు కూడా గౌరవంగా ఉండేది. అలాకాకుండా ఓడిపోయిన వాళ్ళని సొంత బలంతో గెలవలేని నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళని ఛైర్మన్ గా నియమించటమే పవన్ తలతిక్కతనం.
పవన్ చేసిన పనికి ఎంఎల్ఏ రాపాకకు కూడా కచ్చితంగా మండిపోయుంటుంది. గెలిచిన తనను కాదని ఓడిపోయిన వాళ్ళకు, అసలు గెలవలేని వాళ్ళని ఛైర్మన్లుగా కమిటిలకు నియమిస్తే ఎవరికైనా మండుతుంది. దాంతో రాపాక కూడా పార్టీతో పాటు పవన్ కు కూడా దూరంగానే తిరుగుతున్నాడు. పవన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించేటపుడు కూడా ఎంఎల్ఏ ఎక్కడా కనబడటం లేదు. దాంతో మానసికంగా ఎంఎల్ఏ పార్టీకి దూరమైపోయిట్లే అని ఎప్పుడో అర్ధమైపోయింది. అసెంబ్లీలోను బయట కూడా అధికారపార్టీ తీసుకునే నిర్ణయాలకు రాపాక బహిరంగంగానే మద్దతు పలికేస్తున్నాడు. ఒకవైపు జగన్ నిర్ణయాలను పవన్ వ్యతిరేకిస్తుంటే సొంతపార్టీ ఎంఎల్ఏ మద్దతు పలుకుతుండటం అధినేతకు కూడా తలనొప్పులే అనటంలో సందేహం లేదు. కానీ చేసేదేముంది ? ఎలాగూ కంట్రోల్ చేయలేడు కాబట్టే పూర్తిగా వదిలిపెట్టేశాడు.