వరల్డ్ కప్ కి ముందు.. టీమిండియా కు గుడ్ న్యూస్?

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు గాయం బారిన పడి ఇక జట్టుకు దూరమవుతున్నారు. ఇప్పటికే రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా ఇక జట్టుకు దూరమయ్యాడు. కేఎల్ రాహుల్ సైతం ఇలా గాయంతో దూరమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ ఇక వెన్న నొప్పి గాయం కు సర్జరీ చేసుకోవడంతో జట్టుకు అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇలా ప్రధాన ఆటగాళ్లు లేకుండానే కీలక టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతుంది. టీమిండియా జట్టు.

 అయితే ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం గాయం బారినప్పటి జట్టుకు దూరమైన ఆటగాళ్లు వన్డే వరల్డ్ కప్ నాటికి అందుబాటులోకి రావాలని అభిమానులు అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇక వన్డే వరల్డ్ కప్ కి ముందే అటు భారత అభిమానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అందింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని వరల్డ్ కప్ నాటికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందట.

 మరో రెండు వారాల్లో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో కేఎల్ రాహుల్ తన ఫిట్నెస్ శిక్షణ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ లో లక్నో కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఆర్ సి బి తో మ్యాచ్లో గాయపడ్డాడు. దీంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం లండన్లో రాహుల్ సర్జరీ చేసుకున్నాడు. తర్వాత రాహుల్ భార్య అతియ తో కలిసి ఊత కర్రల సహాయంతో లండన్ వీధుల్లో నడుస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారిపోయాయి. ఇక రాహుల్ దూరం కావడంతో అతని స్థానాన్ని ఇషాన్ కిషన్ తో బీసీసీఐ సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: