అతడు లేకపోవడం వల్లే.. ఆర్సిబికి ఇలాంటి పరిస్థితి?

praveen
ప్రతి ఏడాది ఐపిఎల్ సీజన్లో లాగానే ఈ ఏడాది కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తీవ్రంగా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. కనీసం ప్లే ఆఫ్ లో అయిన అడుగుపెడుతుంది అనుకుంటే అది కూడా సాధించలేక లీగ్ దశ నుంచే నిష్క్రమించింది బెంగళూరు జట్టు. ప్లే ఆఫ్ లో అడుగు పెట్టాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో దారుణంగా ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే ఇక బెంగళూరు జట్టు అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి.

 అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బెంగళూరు జట్టులో కెప్టెన్ ఫ్యాబ్ డూప్లెసెస్, విరాట్ కోహ్లీ,  మాక్స్వెల్ మినహా మిగతా బ్యాట్స్మెన్లు అందరూ దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఈ ముగ్గురి పైన బ్యాటింగ్ బాధ్యతలు పడ్డాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే 2023 ఐపీఎల్ సీజన్లో ఆర్సిబి మిడిల్ ఆర్డర్ వైఫల్యం పై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడి కీలక వ్యాఖ్యలు చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రజిత్ పాటీదర్ లేకపోవడం వల్ల బెంగళూరు జట్టుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ టామ్ మూడి అభిప్రాయం వ్యక్తం చేశాడు.

 కాగా ఐపీఎల్ 16వ సీజన్కు గాయం కారణంగా రజిత్ పటీదార్ దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఆర్సిబి జట్టులో అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతను మూడో స్థానంలో అద్భుతమైన ఆటగాడు. అతను జట్టులో లేకపోవడం తో కోహ్లీ డూప్లెసెస్ మ్యాక్స్వెల్ పైనే ఒత్తిడి పెరిగిపోయింది. ఒత్తిడిలో కూడా ఈ ముగ్గురు అద్భుతంగా ఆడారు. మిడిల్ ఆర్డర్లో  మాత్రమే కాదు సరైన ఫినిషర్  కూడా కనిపించలేదు. గత ఏడాది అదరగొట్టిన దినేష్ కార్తీక్ ఈ ఏడాది మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఛాంపియన్గా నిలవాలి అంటే ఒకరిద్దరు ఆడితే సరిపోదు అంటూ టామ్ మూడి అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: