చెన్నై vs గుజరాత్ మ్యాచ్.. ఫిక్స్ అయ్యిందా?

praveen
చాలా రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన నాలుగు జట్ల మధ్య నాకౌట్ మ్యాచ్లు జరుగుతున్నాయ్. ఈ క్రమంలోనే ఇటీవల మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను క్రికెట్ లవర్స్ అందరూ కూడా కన్నార్పకుండా వీక్షించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఒకవైపు ఇరు జట్ల కెప్టెన్లు గురు శిష్యులు కావడం.. మరోవైపు గుజరాత్ డిపెండింగ్ ఛాంపియన్ గా ఉంటే... అటు చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ఛాంపియన్గా ఉండడం.. ఇంకోవైపు ఈ సీజన్లో గుజరాత్ చేతిలో ఒక్కసారి కూడా చెన్నై సూపర్ కింగ్స్ గెలవకపోవడం.. ఇక ఇలాంటి గణాంకాలు చూసిన తర్వాత ఈ మ్యాచ్ పై అందరిలో మరింత అంచనాలు పెరిగిపోయాయి. అంతకుమించి ఇక ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ అటు ధోని హోమ్ గ్రౌండ్ అయినా చపాక్ స్టేడియంలో జరుగుతుండడంతో... ఇక మ్యాచ్ ప్రేక్షకులందరికీ కూడా మరింత ప్రత్యేకంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించి అదరగొట్టింది.

 ఈ క్రమంలోనే 2023 ఐపీఎల్ సీజన్ లో ఫైనల్లో అడుగుపెట్టిన మొదటి టీం గా కూడా రికార్డ్ సృష్టించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇకపోతే చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫిక్సింగ్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. గుజరాత్ బ్యాట్స్మెన్లు పాండ్యా, మిల్లర్,  తేవాటియ కావాలనే అవుట్ అయ్యారని.. రుతురాజ్ పట్టిన విజయ్ శంకర్ క్యాచ్ లో బాల్ నేలకు తాకిన అవుట్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ వెళ్లేందుకే ఇలా ప్లాన్ చేశారని ఆరోపిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: