డబ్ల్యూటీసి ఫైనల్.. మేము ఆ బంతితోనే ఆడతాం : బీసీసీఐ

praveen
మరి కొన్ని రోజుల్లో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఫైనల్ లో అడుగుపెట్టిన టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ ఐసీసీ ఫైనల్ పోరు జరగబోతుంది. ఈ క్రమంలోనే ఈ ఫైనల్లో గెలిచి విశ్వ విజేతగా నిలవబోయే టీం ఏది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు కూడా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.

 ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ లండన్ లోని ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకవైపు క్రికెట్ ఆస్ట్రేలియా మరోవైపు అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇక డబ్ల్యూటీసి ఫైనల్ కోసం తమ జట్లను సంసిద్ధం చేసుకుంటున్నాయి. అయితే మొన్నటి వరకు ఐపీఎల్ లో ఆడిన కొంతమంది ప్లేయర్లు ఇప్పటికే ఇంగ్లాండు పయనం అయ్యారు అన్న విషయం తెలిసిందే. ఇక మరికొన్ని రోజుల్లో మిగతా ప్లేయర్లు అందరూ కూడా ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ప్రాక్టీస్ లో మునిగి తేలబోతున్నారు. ఇకపోతే ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గురించి బీసీసీఐ కీలక వ్యాఖ్యలు చేసింది.


 అయితే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కోసం కూకాబుర బంతిని వాడాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించాడు. ఈ విషయంపై స్పందించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి తాము డ్యూక్స్ బంతితో బరిలోకి దిగుతాము అంటూ స్పష్టం చేసింది. తమ బౌలర్లకు డ్యుక్స్ బంతిని అందించినట్లు తెలిపింది బీసీసీఐ. ఇకపోతే గతంలో కూడా డబ్ల్యూటీసి ఫైనల్ వరకు వచ్చిన టీమిండియా జట్టు ఫైనల్ లో ఓడిపోయి కేవలం రన్నరప్ తో సరిపెట్టుకుంది. కానీ ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లు చేయకుండా.. సంప్రదాయమైన క్రికెట్లో విశ్వవిజేతగా నిలవాలని భావిస్తుంది టీమిండియ. అదే సమయంలో మరోవైపు అటు పటిష్టమైన ఆస్ట్రేలియా కూడా డబ్ల్యూటీసి ఫైనల్ గెలవాలని పట్టుదలతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: