ఇప్పుడు రైనా ఉండుంటే.. ఎంత బాగుండేదో?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో అత్యుత్తమమైన గణాంకాలు నమోదు చేసిన ఆటగాళ్లు కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇలా అత్యుత్తమమైన ప్రదర్శనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో అటు టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా కూడా ఒకరు అని చెప్పాలి. ఏకంగా మిస్టర్ ఐపిఎల్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు సురేష్ రైనా. అప్పటికే అతను ఐపిఎల్ లో మంచి ప్రస్తానాన్ని సాగించాడు. ఇక ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ లోకి వచ్చిన తర్వాత సురేష్ రైనాకు మరింత మంచి గుర్తింపు వచ్చింది.

 చెన్నై సూపర్ కింగ్స్ కష్టాల్లో ఉన్న ఎన్నోసార్లు సురేష్ రైనా తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో జట్టును కష్టాల నుంచి గట్టేక్కించాడు. అంతేకాదు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ప్రియ మిత్రుడిగా కూడా సురేష్ రైనా ప్రస్థానం కొనసాగించాడు అని చెప్పాలి. ఇక చెన్నై అభిమానులు ధోనిని తలా అని ఎలా పిలిచేవారో.. అటు సురేష్ రైనా అని చిన్నతలా అని పిలుస్తూ ఉండేవరూ.  అలాంటి సురేష్ రైనా అనూహ్యంగా  ఎవరు ఊహించని విధంగా మొదట చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఇక ఆ తర్వాత ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్నాడు.

 ఇక సురేష్ రైనా లాంటి ప్లేయర్ లేకుండా గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఎంత దారుణమైన ప్రస్థానం కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే 2023 ఐపీఎల్ సీజన్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయింది. నేడు గుజరాత్ తో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడబోతుంది. దీంతో మిస్టర్ ఐపిఎల్ సురేష్ రైనాని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. క్వాలిఫైయర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక ప్లేయర్ సురేష్ రైనానే అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జట్టులో రైనా లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ లో అడుగుపెట్టడం మొదటిసారి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు జట్టులో రైనా ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: