ఐపీఎల్ : ప్లే ఆఫ్ చేరాలంటే.. ఇన్ని జరగాలా?

praveen
ఐపీఎల్ పోరు ప్రస్తుతం మరింత రసవత్తరంగా  మారిపోయింది అన్న విషయం తెలిసిందే. లీగ్ మ్యాచ్ లు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలోనే ప్లే ఆఫ్ లో అడుగు పెట్టే జట్లు ఏవి అన్న విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఎక్కువ పాయింట్లు సాధించి గుజరాత్ ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది. ఇక నిన్న జరిగిన మ్యాచ్లలో విజయం సాధించడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో జట్లు కూడా అటు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్లే ఆఫ్ రేస్ లో నిలిచే నాలుగో టీం ఏది అన్న విషయం పై నేడు స్పష్టత రానుంది.

 ఈ క్రమంలోనే ప్లే ఆఫ్ లో నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం కోసం ప్రస్తుతం మూడు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది అని చెప్పాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నాలుగో స్థానం కోసం పోటీ జరుగుతుంది   అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటికే 14 లీగ్ మ్యాచ్లు ఆడింది. దీంతో ఇక రాజస్థాన్ భవితవ్యం కేవలం ఇతరజట్లు ఆడబోయే ఫలితాల పైన ఆధారపడి ఉంది అని చెప్పాలి. మరి ఏం జరిగితే ఏ జట్టు ప్లే ఆఫ్ కు వెళ్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్లే ఆఫ్ లో అడుగు పెట్టాలి అంటే నేడు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.

 ఒకవేళ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ లో అడుగు పెట్టాలి... అంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరగబోయే మ్యాచ్లో గెలవడంతో పాటు గుజరాత్ తో జరగబోయే మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడిపోవలసి ఉంటుంది.

 ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టాలి అంటే ముంబై ఇండియన్స్ ఓడిపోవడం కాదు.. బెంగళూరు జట్టు ఐదు రన్స్ కంటే ఎక్కువ తేడాతో ఓడిపోవలసి ఉంటుంది. అలా జరిగితేనే రాజస్థాన్ ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుంది.

 ఒకవేళ ముంబై, బెంగళూరు రెండు టీమ్స్ కూడా విజయం సాధిస్తే నెట్ రన్ రేట్ ఎవరికి మెరుగ్గా ఉంటే వారు ప్లే ఆఫ్ కి చేరుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: