ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టీమిండియాకు ఎన్నో ర్యాంక్ అంటే?

praveen
ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో ఉన్న జట్ల ప్రదర్శన ఆధారంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు సరికొత్తగా ర్యాంకింగ్స్ ని ప్రకటించడం చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా కేవలం వారం వ్యవధిలోనే ఇక వన్డే ర్యాంకింగ్స్ లో కొన్ని కొన్ని జట్లు ప్రభంజనం సృష్టించడం చేస్తూ ఉంటే.. అదే సమయంలో పేలవ ప్రదర్శన చేసిన జట్లు ర్యాంకింగ్ పడిపోతూ ఉండడం కూడా చూస్తూ ఉంటాం. ఇకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వన్డే ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది.

 అయితే గతవారం విడుదల చేసిన  ర్యాంకింగ్స్ లో అటు పాకిస్తాన్ జట్టు సంచలనం సృష్టించింది అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ హిస్టరీలో మొదటిసారి వన్డే ఫార్మాట్లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఎన్నో రోజుల నుంచి అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకుంటున్న ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చి టాప్ ప్లేస్ లోకి వెళ్ళింది అని చెప్పాలి.  కానీ పాకిస్తాన్ సాధించిన టాప్ ప్లేస్ కేవలం వారం రోజుల ముచ్చటే అన్నది అర్థమైంది. ఎందుకంటే ఇటీవలే విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో మళ్లీ పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు సత్తా చాటింది. 118 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది ఆస్ట్రేలియా.

 మరోసారి తన అగ్రస్థానాన్ని సొంతం చేసుకుని పదిలంగా కనిపిస్తుంది అని చెప్పాలి. మరోవైపు మొన్నటి వరకు భారత జట్టు రెండో ర్యాంకులో ఉండగా ఇక ఇప్పుడు రెండో ర్యాంకు నుంచి మూడో ర్యాంకు పడిపోయింది అని చెప్పాలి. అయితే గత వారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న పాకిస్తాన్ జట్టు చివరికి ఇక రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ లిస్టులో చూసుకుంటే..న్యూజిలాండ్ 104, ఇంగ్లాండ్ 101, సౌత్ ఆఫ్రికా 101, బంగ్లాదేశ్ 97, ఆఫ్ఘనిస్తాన్ 88, శ్రీలంక 80, వెస్టిండీస్ 72 రేటింగ్ పాయింట్లతో తర్వాత స్థానాలలో కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: