ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. సత్తా చాటిన టీమిండియా క్రికెటర్లు?

praveen
అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఆటగాళ్లకు అటు ఐసిసి ర్యాంకింగ్స్ పేరుతో ఉత్సాహాన్ని ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్రతి వారం లేదా ప్రతి నెల కూడా ఇలా ర్యాంకింగ్స్ ను ప్రకటిస్తూ ఉంటుంది. ఇలా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించే ర్యాంకింగ్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల టెస్ట్ క్రికెట్ కు సంబంధించిన ర్యాంకింగ్స్ ప్రకటించింది ఐసిసి.

 ఇలా సాంప్రదాయమైన టెస్టు క్రికెట్కు సంబంధించిన ర్యాంకింగ్స్ లో అటు టీమ్ ఇండియా సత్తా చాటింది అనే విషయం తెలుస్తుంది. దీంతో భారత అభిమానులు అందరూ కూడా ఆనందంగా మునిగిపోయారు. ఇకపోతే ఇటీవల క్రికెట్ కౌన్సిల్ ఏకంగా వన్ డే ఫార్మాట్ కు సంబంధించి ర్యాంకింగ్స్ ప్రకటించగా.. ఇక భారత బ్యాట్స్మెన్లు సత్తా చాటారు అని చెప్పాలి. ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో ఏకంగా ముగ్గురు టీం ఇండియా ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు.

 గత కొంతకాలం నుంచి ఫార్మాట్ తో సంబంధం లేకుండా అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తున్న భారత యువ ఓపనర్ శుభమన్ గిల్  ఇటీవల ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఏకంగా 738 రేటింగ్ పాయింట్స్ తో నాలుగవ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 719 పాయింట్లు ఏడవ స్థానంలో నిలిచాడు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 707 పాయింట్లతో 9వ స్థానం సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి  ఈ లిస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం 887 పాయింట్లతో ఒకటవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. బౌలర్లలో 691 పాయింట్లతో సిరాజ్ రెండొవ స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్రౌండర్లలో టాప్ 10 లో భారత్ నుంచి ఎవరూ లేకపోవడం గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: