ముంబై గెలిచినా.. రోహిత్ చెత్త రికార్డు?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్లో పెద్దగా రాణించడం లేదు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ రానించిన ఒకటి రెండు మ్యాచ్లలో మినహా ఇక ఎక్కువ మ్యాచ్లలో మాత్రం తక్కువ పరుగులకే వికెట్ కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గతంలో టీమిండియా తరఫున ఆడుతున్నప్పుడు ఇలాగే జరిగింది. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను కెప్టెన్ గా  సమర్థవంతంగానే ముందుకు నడిపిస్తున్నా.. బ్యాట్స్మెన్ గా మాత్రం విఫలమవుతున్నాడు. ఏదో ఒక మ్యాచ్ లో మెరుపులు మెరిపించిన రోహిత్ శర్మ.. ఇక ఆ తర్వాత మాత్రం అదే ఫామ్ తర్వాత మ్యాచ్లో కొనసాగించలేకపోతున్నాడు.

 ఓపెనర్ గా బరిలోకి దిగుతూ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి మంచి ఓపెనింగ్ అందించాల్సిన రోహిత్ శర్మ.. చివరికి నిరాశ పరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోను రోహిత్ శర్మ మరోసారి అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేశాడు. బాగా రాణిస్తాడు అనుకుంటే కనీసం పరుగుల ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు రోహిత్ శర్మ. అయితే ఇటీవల పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో మిగతా బ్యాట్స్మెన్లు రాణించడంతో ఇక భారీ టార్గెట్ ను సైతం బద్దలు కొట్టి విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్. కానీ రోహిత్ శర్మ డక్ అవుట్ కావడాన్ని అటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 అయితే ఇటీవల పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్ అయిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపిఎల్ హిస్టరీలో ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు అని చెప్పాలి. అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు రోహిత్ శర్మ. ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఇలా డక్ అవుట్ ఎక్కువసార్లు అయిన ప్లేయర్ లు గా ఉన్నారు. కాగా రోహిత్ శర్మ సైతం 15 సార్లు డకౌట్ అవడంతో వీరీ సరసన చేరిపోయాడు. ఇక రోహిత్ కంటే ముందు మనదీప్ సింగ్ 15 సార్లు, దినేష్ కార్తీక్ 15 సార్లు, సునీల్ నరైన్ 15 సార్లు డకౌట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: