RCB ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అతని సర్జరీ సక్సెస్?
కొంతమంది అయితే ఏకంగా గాయంతో సర్జరీ చేయించుకుని కొన్ని నెలలపాటు క్రికెట్ కు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రజత్ పాటిదర్ సైతం ఇలాగే గాయం బారిన పడ్డాడు. ఆర్సిబి జట్టులోకి వచ్చి తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు రజత్ పాటీదార్. తనద ప్రదర్శనతో ఏకంగా జట్టులో కీలక ప్లేయర్గా మారిపోయాడు. అయితే గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇక సర్జరీ తప్పనిసరి అని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
అయితే ఇక అతని గాయం కి సంబంధించిన అప్డేట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. కాగా ఇటీవల సోషల్ మీడియా వేదిక స్పందించిన రజత్ పాటిదార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. కాలి మడమ గాయంతో బాధపడుతున్న ప్లేయర్ ప్రస్తుతం ఇంగ్లాండ్లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే తన సర్జరీ అప్డేట్ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని.. రికవరీకి సిద్ధంగా ఉన్నాను అంటూ తెలిపాడు. నా రికవరీ గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోని షేర్ చేశాడు రజాత్ పాటిదార్. ఇక అతను సర్జరీ సక్సెస్ కావడంతో ఫాన్స్ సంతోషంలో మునిగిపోయారు.