రోహిత్ లేకుంటే.. కోహ్లీకే కెప్టెన్సీ ఇవ్వండి : రవి శాస్త్రి

praveen
రోహిత్ శర్మ తర్వాత టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అనే విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతూనే వస్తుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్ తర్వాత సారధ్య బాధ్యతలు చేపట్టబోయేది హార్దిక్ పాండ్యానే విషయాన్ని అటు బీసీసీఐ కూడా సూత్రప్రాయంగా చెప్పకనే చెబుతుంది. ఎందుకంటే రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్న ప్రతిసారి కూడా అటు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంటుంది టీమిండియా యాజమాన్యం.

 దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఇక హార్దిక్ పాండ్యానే సారధిగా భారత జట్టును ముందుకు నడిపించబోతున్నాడు అని ప్రస్తుతం అందరూ ఫిక్స్ అయిపోయారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో అటు టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి మాత్రం సరికొత్త వాదనను తెరమీదకి తీసుకువచ్చాడు. టీమిండియా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో మాజీ సారధి విరాట్ కోహ్లీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి అంటూ రవి శాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు.

 2021 లో ఇంగ్లాండ్ లో జరిగిన టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీనే కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించాడు. ఆ సిరీస్ లో వాయిదా పడ్డ ఐదవ టెస్టును గత ఏడాది భారత్ ఆడగా.. అప్పటికి కోహ్లీ కెప్టెన్సీ నుండి  తప్పుకున్నాడు. కానీ రోహిత్ గాయపడటంతో ఆ మ్యాచ్ లొ బుమ్రా సారధ్య బాధ్యతలు చేపట్టాడు. అయితే గత ఏడాది ఇంగ్లాండ్ తో సిరీస్లో రోహిత్ గాయపడిన సమయంలో విరాట్ కోహ్లీకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నాను. ఎందుకంటే సిరీస్లో మొదటి నడిపించింది  కోహ్లీనే.. 2-1 తేడాతో జటును ఆదిక్యంలోకి తీసుకువెళ్ళింది కోహ్లీనే. కానీ చివరికి ఆ కోహ్లీకి కెప్టెన్సీ ఇవ్వకుండానే చివరి టేస్ట్ నిర్వహించారు. మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురైతే విరాట్ కోహ్లీకే బాధ్యతలు అందేలా కోచ్ రాహుల్  చూడాలి అంటూ రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: