వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో రహానేకి ఛాన్స్!

Purushottham Vinay
ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ ఆస్ట్రేలియా, ఇండియా టీమ్స్ మధ్య ఇంగ్లాండ్‌లో జరగనుంది. ఇంగ్లాండ్‌లోని ది ఓవల్ వేదికగా జూన్ 7-11 తేదీల మధ్య ఈ మ్యాచ్ అనేది గ్రాండ్ గా జరుగుతుంది.ఈ మ్యాచ్‌ కోసం గాను ఇప్పటికే ఆస్ట్రేలియా టీం గా ప్రకటించగా.. బీసీసీఐ తాజాగా రోహిత్ శర్మ సారథ్యంలో మొత్తం 15 మంది ఆటగాళ్లతో కూడిన ఇండియా టీంని ప్రకటించింది. 17 నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అజింక్య రహానే ఈ మ్యాచ్‌ ద్వారా ఇక రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.ఈ ఐపీఎల్ 2023 సీజన్‌లో రహానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపును రెచ్చిపోయి ఒక రేంజ్ లో ఆడుతున్నారు. రెహానే మునుపెన్నడూ లేని విధంగా బ్యాట్‌తో చాలా అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నాడు. ప్రస్తుతం రహానే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గతంలో విదేశాల్లో జరిగిన టెస్టు మ్యాచ్‌లలో కూడా రహానే రాణించిన అనుభవం ఉంది. దీంతో బీసీసీఐ కూడా రహానేను తుది జట్టులో ఎంపిక చేసింది. ఒక్క రహానే తప్ప మొన్నటి దాకా టెస్టు మ్యాచ్‌లలో కంటిన్యూ అయిన వారినే బీసీసీఐ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ఎంపిక చేసింది.


ఇంకా అదే విధంగా వికెట్ కీపర్, ఆంధ్రా క్రికెటర్ కేఎస్ భరత్‌కు కూడా బీసీసీఐ అవకాశం కల్పించడం జరిగింది. అయితే, మరో తెలుగు క్రికెటర్ అయిన హనుమ విహారికి మాత్రం నిరాశే ఎదురైంది. ఇక సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లను మాత్రం బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు.ఇంతకు ముందు జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ కు కూడా టీమిండియా అర్హత సాధించిన సంగతి తెలిసిందే.అయితే, ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడం జరిగింది. ఇక ఈ సారి ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచేందుకు రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీం రెడీ అవుతుంది.ఇక బీసీసీఐ ప్రకటించిన ఇండియన్ టీం ఇదే..రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ, అజిక్యా రహానే, కే.ఎల్. రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.. వంటి ఆటగాళ్లు ఆడనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: