ధోని, కోహ్లీ, రోహిత్ కాదు.. చాహల్ ఫేవరెట్ కెప్టెన్ ఎవరంటే?

praveen
భారత క్రికెట్లో స్టార్స్ స్పిన్నర్ గా కొనసాగుతున్న చాహల్.. ఇక అదే స్పిన్ మ్యాజిక్ ను ఐపీఎల్ లో కూడా కొనసాగిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పలు జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించిన చాహల్.. తన అదిరిపోయే ప్రదర్శనతో ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు అని చెప్పాలి. మిగతా భారత బౌలర్లతో చూస్తే ఇక అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా కూడా చాహల్ రికార్డు సృష్టించాడు. అయితే గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఎన్నో ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన చాహల్.. గత రెండు మూడు సీజన్ల నుంచి మాత్రం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూన్నాడు.

 ఈ క్రమంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టి తన సత్తా ఏంటో నిరూపిస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ ఏడాది కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లకు ఇచ్చే పరుపులు క్యాప్ రేసులో కూడా ముందున్నాడు అని చెప్పాలి. అయితే ఇలా భారత జట్టులో స్టార్ ప్లేయర్ గా ఉన్న వారిని.. మీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరు అని అడిగితే. విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ పేరు చెబుతారు. లేదంటే మహేందర్ సింగ్ ధోని పేరును కూడా చెబుతూ ఉంటారు కొంతమంది.

 కానీ చాహల్ మాత్రం ఎవరు చెప్పని పేరు చెప్పాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కాదు తన ఫేవరెట్ కెప్టెన్ సంజూ శాంసన్ అంటూ యుజ్వేంద్ర చాహల్ ఇటీవల వెల్లడించాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధోని లాగా సంజు శాంసన్ కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. బౌలింగ్ విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తాడు. నా బౌలింగ్ మెరుగవ్వడానికి కారణం కూడా సంజూనే అంటూ చాహల్ చెప్పుకొచ్చాడు. అందుకే అతనే నా ఫేవరెట్ కెప్టెన్ అంటూ తెలిపాడు. అయితే చాహల్ లిస్టులో ధోని, రోహిత్, కోహ్లీ పేరు చెప్పకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: