ఐపీఎల్ : 40 ఏళ్ల వయసులో తగ్గేదేలే.. అరుదైన రికార్డ్?

praveen
సాధారణంగా నలభై ఏళ్ల వయస్సు వచ్చింది అంటే చాలు క్రికెటర్లకు అది రిటైర్మెంట్ వయస్సు అని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే ఈ వయస్సు వచ్చేసరికి అందరూ క్రికెటర్లు కూడా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి తమ సెకండ్ ఇన్నింగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం 45 ఏళ్లు దాటిపోతున్న తమలో ఇంకా ఆడే సత్తా అలాగే ఉంది అని నిరూపిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు 40 ఏళ్ళ అమిత్ మిశ్రా సైతం ఐపీఎల్లో అదరగొడుతూ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు.

 ఇక ప్రతి మ్యాచ్ లో కూడా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వికెట్లను పడగొడుతూనే ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అమిత్ మిశ్రా టాప్ ఫైవ్ లో నిలిచాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ఐపిఎల్ 158 మ్యాచ్ లు ఆడిన 170 వికెట్లు తీశాడు. ఈ సంఖ్యను చేరుకోవడానికి అమిత్ మిశ్రాకు 40 ఏళ్ళు పట్టింది అని చెప్పాలి. దీనికోసం 550 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయితే 122 మ్యాచ్లోనే మలింగ 170 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పుడు అమిత్ మిశ్రా మలింగాను సమం చేశాడు.

 ఇకపోతే 137 ఐపీఎల్ మ్యాచ్లలో 177 వికెట్లు తీసిన  చాహల్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో కూడా పర్పుల్ క్యాప్ రేస్ లో మిగతా బౌలర్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. 161 మ్యాచ్ లో 183 వికెట్లు తీసిన బౌలర్గా బ్రావో అగ్రస్థానంలో ఉన్నాడు. కాగా ప్రస్తుతం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో క్రికెట్ నుంచి తప్పుకున్నాడు అని చెప్పాలి. దీంతో బ్రావో రికార్డును ఇతర బౌలర్లు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. చాహల్ బ్రావో రికార్డుకు చాలా దగ్గరగానే ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: