RCB vs RR: నేడు గెలుపు ఎవరిదో?

Purushottham Vinay
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఈరోజు జరగబోయే మొదటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తలపడుతుంది.బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టీమ్‌ని యంగ్ బ్యాట్స్ మెన్ సంజూ శామ్సన్ నడిపిస్తుండగా.. ఆర్‌సీబీ టీంని ఎవరు నడిపిస్తారనేది ఇంకా తెలియరాలేదు. ఆ టీమ్ రెగ్యులర్ కెప్టెన్ అయిన ఫాఫ్ డుప్లెసిస్ గాయం కారణంగా తమ చివరి మ్యాచ్‌లో టీంకి విరాట్ కోహ్లీ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఫాఫ్ నడిపిస్తాడో.. లేదా విరాట్ కోహ్లీ మరోసారి నాయకత్వ పగ్గాలు అందుకుంటాడా అనేది తెలియాలంటే వెయిట్ చేసి చూడాల్సిందే.అలాగే మరోవైపు ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి దాకా 28 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగగా, వాటిలో బెంగళూరు టీందే పైచేయి. ఈ 28 మ్యాచ్‌లలో ఆర్‌సీబీ మొత్తం 13 మ్యాచ్‌ల్లో గెలవగా, రాజస్థాన్ టీం 12 విజయాలు సాధించింది. ఇంకా మరో 3 మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ టీం ఎలా అయినా ఈ మ్యాచ్ గెలిచి, తమ ఖాతాలో కూడా 13వ విజయాన్ని వేసుకోవాలని ప్లాన్ చేస్తుంది.


ఇదిలా ఉండగా ఈరోజు మ్యాచ్‌ కోసం RCB టీం ఆటగాళ్లు ఆకుపచ్చ జెర్సీని ధరించి మైదానంలోకి దిగనున్నారు. చెట్లను రక్షించడం ఇంకా పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా గో గ్రీన్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది ఆర్సీబీ ఫ్రాంచైజీ.ఇక ఈ సీజన్లో అయినా RCB టీం కప్ కొట్టాలని RCB ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి చూడాలి ఏమవుతుందో..ఆర్‌సీబీ టీం విషయానికి వస్తే..విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వేన్ పార్నెల్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వైశాక్ విజయ్‌కుమార్ ఇంకా మహ్మద్ సిరాజ్ ఆడనున్నారు.రాజస్థాన్ రాయల్స్ టీం విషయానికి వస్తే..జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ ఇంకా అలాగే యుజ్వేంద్ర చాహల్ మ్యాచ్ ఆడనున్నారు.మరి చూడాలి ఈరోజు ఏ టీం విన్ అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: