ధోని మాత్రమే కాదు.. వీళ్ళకి కూడా ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్?

praveen
సాధారణంగా వయసు మీద పడిన సీనియర్ క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీలు కూడా పెద్దగా ఆసక్తి చూపించవు. దీంతో అవకాశాలు రాక  చివరికి సీనియర్ క్రికెటర్లు ఐపీఎల్ నుంచి తప్పుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి కూడా అటు మహేంద్రసింగ్ ధోనీకి చివరి ఐపీఎల్ అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. అయితే కేవలం ధోనీకి మాత్రమే కాదు మరి కొంతమంది సీనియర్ ప్లేయర్లకు కూడా ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కాబోతుంది అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఎన్నో ఏళ్ల నుంచి ఐపీఎల్లో వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఇక తమ అభిమానులందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ పంచిన కొంతమంది సీనియర్ ప్లేయర్లు.. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ తర్వాత ఐపీఎల్ కు గుడ్ బై చెప్పబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయ్. ఎందుకంటే సదరు సీనియర్ ప్లేయర్లు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం లేదా ఛాన్సులు లేక ఇక అంతర్జాతీయ క్రికెట్ కి దూరంగా ఉండటం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అంతేకాకుండా వయస్సు పెరగడం,  ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ కోల్పోవడం లాంటి కారణాల వల్ల కూడా కొంతమంది ఆటగాళ్లు ఈ సీజన్ తర్వాత రిటైర్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

 ఇలా ఈ ఐపిఎల్ సీజన్ తర్వాత ఇక ఈ టోర్నీకి దూరం కాబోతున్న సీనియర్ ఆటగాళ్లు ఎవరు ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ధోని మొదటి వరుసలో ఉన్నాడు. ప్రస్తుతం ధోనీకి 41 ఏళ్ళు. ఇక అయితే అతనికి ఇదే చివరి ఐపీఎల్ అని అందరూ అంటున్నారు. వచ్చే ఏడాది ఐపిఎల్ సీజన్ వరకు ధోని ఫిట్గా లేకపోతే ఇక రిటైర్మెంట్ ప్రకటించడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.

 అమిత్ మిశ్రా : ధోని తర్వాత అటు ఐపిఎల్ లో మోస్ట్ సీనియర్ గా కొనసాగుతున్నాడు అమిత్ మీశ్రా. ఇప్పుడు లక్నో జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే వచ్చే ఐపిఎల్ సీజన్లో ఇతను రిటర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందట.
 దినేష్ కార్తీక్  : బెంగళూరు జట్టు తరుపున ప్రాతినిధ్య వహిస్తున్న 37 ఏళ్ల దినేష్ కార్తీక్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యాడు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీకి కూడా గుడ్ బై చెప్పేస్తాడు అనేది తెలుస్తుంది.

 ఇషాంత్ శర్మ  : 34 ఏళ్ళ సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ వైపు ఏ ఫ్రాంచైజీ   ఆసక్తి చూపించడం లేదు. అతను మునిపటి ఫామ్ నిరూపించుకోలేకపోతున్నాడు. దీంతో వచ్చే సీజన్ లో ఆడటం కష్టమే అనేది తెలుస్తుంది.

 అంబటి రాయుడు : 37 ఏళ్ల అంబటి రాయుడు ప్రస్తుతం చెన్నై జట్టులో కొనసాగుతున్నాడు. పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఇక ఇదే అతనికి చివరి ఐపీఎల్ సీజన్ అని అంటూ ఫ్యాన్స్ కూడా భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: