పాకిస్థాన్ కొత్త ఫిట్టింగ్.. వరల్డ్ కప్ మ్యాచ్ లు అక్కడ అయితేనే ఆడతారట?

praveen
క్రికెట్లో బద్ధ శత్రువులుగా కొనసాగుతున్న పాకిస్తాన్, టీమ్ ఇండియాల మధ్య అటు క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృశ్య ఇక దశాబ్దాల నుంచి ఈ నిషేధం కొనసాగుతూనే వస్తుంది. అందుకే పాకిస్తాన్, భారత జట్లు కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే తలబడటం చూస్తూ ఉన్నాం. అయితే ఇక ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్ వేదికగా,  వన్డే వరల్డ్ కప్ భారత్ వేదికగా జరగాల్సి ఉంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే పాకిస్థాన్లో జరగబోయే ఆసియా కప్ను తటస్థ వేదికపై నిర్వహించినప్పుడు మాత్రమే తాము టోర్నీలో పాల్గొంటామని.. లేని పక్షంలో తాము టోర్ని నుంచి నిష్క్రమిస్తాము అంటూ ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ అటు యూఏఈ లేదా శ్రీలంక వేదికగా భారత్ ఆడే మ్యాచ్లను నిర్వచించాలని నిర్ణయించే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. అదే సమయంలో ఇక మొన్నటి వరకు వన్డే వరల్డ్ కప్ కోసం తమకు కూడా తటస్థ వేదికను ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరింది.

 ఇక ఇప్పుడు మరో డిమాండ్ ను తెరమీదికి  తీసుకువచ్చింది అని చెప్పాలి. మొత్తంగా భారత్ వేదికగా 12 నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచ్లు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే అటు పాకిస్తాన్ మాత్రం కోల్కతా లేదా చెన్నై వేదికగానే వరల్డ్ కప్ షెడ్యూల్లో పాకిస్తాన్ ఆడబోయే అన్ని మ్యాచ్లు ఆడతాము అంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ఐసిసి ఉన్నతాధికారులతో పాకిస్తాన్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. వరల్డ్ కప్ కి సంబంధించి అన్ని మ్యాచ్ లపై  ఐసీసీ, భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఇక షెడ్యూల్ వచ్చేంతవరకు కూడా దీనిపై ఒక క్లారిటీ రాదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: