హాట్రిక్ సాధించడంలో.. రషీద్ ఖాన్ అరుదైన రికార్డు?

praveen
ప్రపంచ క్రికెట్లో అద్భుతమైన స్పిన్నర్లు ఎవరు అని చర్చ తెరమీదకి వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు రషీద్ ఖాన్. తన స్పిన్ బౌలింగ్ తో తక్కువ సమయంలోనే ప్రపంచ క్రికెట్లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు రషీద్ ఖాన్. స్టార్ బ్యాట్స్మెన్లను సైతం తన స్పిన్ బౌలింగ్ తో ముప్పు తిప్పులు పెట్టి వికెట్ దక్కించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎప్పుడు అంచనాలకు మంచి ప్రదర్శన చేస్తూ అటు ఎన్నో అరుదైన రికార్డులను కూడా కొల్లగొడుతూ ఉంటాడు ఈ ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్.

 అయితే కేవలం అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాదు అటు ఐపీఎల్ లో సైతం తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక రషీద్ ఖాన్ జట్టులో ఉన్నాడు అంటే చాలు కీలకమైన సమయంలో వికెట్లు పడగొడతాడు అని అభిమానులు బలంగా నమ్ముతూ ఉంటారు. ఇక అభిమానుల నమ్మకాన్ని నిలబెడుతూ ఎప్పుడు హైయెస్ట్ వికెట్ టేకర్ గా కూడా అతను నిలుస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే గుజరాత్ టైటాన్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అటు రషీద్ ఖాన్ తన స్పిన్ బౌలింగ్తో మ్యాజిక్ చేశాడు. ఏకంగా స్టార్ ప్లేయర్లను వరుసగా పెవీలియన్ పంపించి హ్యాట్రిక్ సాధించాడు అని చెప్పాలి.

 గుజరాత్ ఓడిపోయినప్పటికీ అతని బౌలింగ్ ప్రదర్శన మాత్రం అందరి మనసులను గెలుచుకుంది అని చెప్పాలి. ఇలా కోల్కతా ఇన్నింగ్స్ 17 ఓవర్లో హ్యాట్రిక్  వికెట్లు తీసిన రషీద్ ఖాన్ అరుదైన రికార్డును సాధించాడు. అత్యధిక సార్లు హ్యాట్రిక్ సాధించిన బౌలర్గా నిలిచాడు. టీ20 చరిత్రలో రషీద్ ఖాన్ నాలుగుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీయగా.. అమిత్ మిశ్రా, మహమ్మద్ సమీ, ఆండ్రూ టై, ఇమ్రాన్ తాహిర్ మూడేసి సార్లు ఇలా హ్యాట్రిక్ సాధించిన ఘనతను  పొందారు అని చెప్పాలి. రషీద్ హ్యాట్రిక్ తో కోల్కతాను దెబ్బ కొట్టినా.. చివర్లో రింకు సింగ్ మ్యాజిక్ చేసి జట్టును గెలిపించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: