చీరకట్టులో హార్మన్ ప్రీత్.. చూసి ఫీదా అవుతున్న ఫ్యాన్స్?

praveen
సాధారణంగా భారత్లో క్రికెట్ కి కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయం తెరమీదకి వచ్చిన కూడా అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెటర్లు అందరినీ కూడా అభిమానులు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్పోర్ట్స్ డ్రెస్ లోనో లేదంటే మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఇక టీమిండియా జెర్సీ వేసుకున్నప్పుడో చూస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇక సాధారణ దుస్తులు ధరించినప్పుడు చూడటం మాత్రం చాలా తక్కువగానే జరుగుతూ ఉంటుంది.

 ఆటగాళ్లు ఎప్పుడూ ఏదో ఒక మ్యాచ్ నిమిత్తం ప్రాక్టీస్ లో ఉండడం లేదా మ్యాచ్ ఆడుతూ ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడూ స్పోర్ట్స్ డ్రెస్ లో తప్ప నార్మల్ డ్రెస్ లో కనిపించరు అని చెప్పాలి. ఒకవేళ నార్మల్ డ్రెస్ లో ఫోటోలు దిగిన ఇక వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి కొంతమంది క్రికెటర్లు మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. ఇక అటు మహిళా క్రికెటర్లలో కూడా టీమ్ ఇండియా జెర్సీలో మినహా  సాంప్రదాయమైన వస్త్రధారణలో కనిపించడం చాలా అరదు. ఇక ఇటీవల టీమిండియా ఉమెన్స్ టీం కెప్టెన్ హార్మన్ ప్రీత్  సాంప్రదాయమైన వస్త్రధారణలో కనిపించి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

 ఎప్పుడు ఏదో ఒక జెర్సీలో కనిపించే హార్మన్ ప్రీత్ ఇటీవలే చీరకట్టులో ఎంతో సాంప్రదాయమైన వస్త్రధారణలో కనిపించి అభిమానులను ఆకర్షిస్తుంది. ఇటీవల ఈ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకుంది హార్మోన్ ప్రీత్ కౌర్. ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. హార్మోన్ ప్రీత్ కౌర్ లుక్స్ లైక్ క్వీన్ అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే మొన్నటికీ మొన్న హర్మన్ ప్రీత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఉమెన్స్ ప్రీమియర్టైటిల్ గెలుచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: