ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రిషబ్ పంత్ రాబోతున్నాడు?

praveen
టీమిండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రిషబ్ పంత్ అటు ఐపిఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే . అయితే ఈ ఏడది మాత్రం అతను ఢిల్లీ క్యాపిటల్స్ కి అందుబాటులో ఉండడం లేదు. దీనికి కారణం అతను గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన ఘోరమైన రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. దీంతో తీవ్ర గాయాల పాలైన రిషబ్ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతని మోకాలికి కూడా సర్జరీ కావడంతో దాదాపు మరో ఏడాది పాటు అతను క్రికెట్ కు దూరంగా ఉంటాడు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇక పంతు లేకపోవడంతో జట్టులో అనుభవంగల ప్లేయర్ గా ఉన్న డేవిడ్ వార్నర్ కు సారధ్య బాధ్యతలను అప్పగించింది ఢిల్లీ జట్టు యాజమాన్యం. అయితే ఇక పంత్ దూరమైనప్పటికీ అతని జెర్సీని డగ్ అవుట్ లో పెట్టుకొని ఢిల్లీ ఐపీఎల్ లో మ్యాచ్లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక వార్నర్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు మొదటి మ్యాచ్ లో ఓడిపోయింది. కాగా నేడు ఢిల్లీ, గుజరాత్ టైటాన్స్ తో రెండో మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండో మ్యాచ్ కి ముందు అటు అభిమానులందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది అని చెప్పాలి.

 ఏకంగా ఢిల్లీ జట్టు గుజరాత్ టైటాన్స్ తో ఆడబోతున్న మ్యాచ్ కోసం  రిషబ్ పంత్ రాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కి మాజీ కెప్టెన్ రిషబ్  పంత్ హాజరై తమ జట్టును సపోర్ట్ చేయబోతున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఎట్టకేలకు రిషబ్ పంత్ సమక్షంలో ఢిల్లీ జట్టు మరోసారి మ్యాచ్ ఆడబోతుంది అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: