అతనికి కూడా.. RCB జట్టే ఫేవరెటట తెలుసా?

praveen
2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తం గా ఎక్కడ చూసినా కూడా ఈ క్యాష్ రిచ్ లీగ్ గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమం లోనే ఐపీఎల్ లో ఆడిన అనుభవం గురించి కొంత మంది చర్చించుకుంటూ ఉంటే ఇక ఐపీఎల్లోకి కొత్తగా వచ్చే ఆటగాళ్లు ఈ లీగ్ లో ఆడెందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ ఇక తమ అభిప్రాయాలను అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే ఐపీఎల్ లో గత ఏడాది జరిగిన మినీ వేలం కారణం గా ఇక ఎంతోమంది ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరో జట్టులోకి వెళ్లిపోయారు. దీంతో ఇక సరికొత్తగా ఆటను ప్రారంభించబోతున్నారు అని చెప్పాలి. ఈ విషయం గురించి కూడా మాట్లాడుతూ ఎవరితో డ్రస్సింగ్ రూమ్ పంచుకుంటే బాగుంటుంది అనే విషయంపై విషయాలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లబుషేన్ సైతం ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేసాడు.

 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తన ఫేవరెట్ అంటూ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లబుషేన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఫాన్స్ తో చిట్ చాట్ నిర్వహించగా.. ఇక అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు. ఐపిఎల్ లో అవకాశం దొరికితే కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయాలని ఆశపడుతున్నాను అంటూ లబుషేన్ వ్యాఖ్యానించాడు.. ఇక రోహిత్ బ్యాటింగ్ ఎంతగానో ఆస్వాదిస్తానని తెలిపాడు. తాను ఎదుర్కొన్న బెస్ట్ స్పిన్నర్ లో అశ్విన్ ఒకడు అంటూ చెప్పాడు. ఇకపోతే 2023 ఐపీఎల్ కోసం లబుషేన్ తన పేరును రిజిస్టర్ చేసుకుంటే ఏ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb

సంబంధిత వార్తలు: