వైరల్ : సిక్సర్లతో విరుచుకుపడుతున్న.. సన్రైజర్స్ బ్యాట్స్ మెన్?

praveen
భారత్లో ఐపిఎల్ హడావిడి మొదలైంది . మార్చ్ 31వ తేదీ నుంచి క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే అన్ని జట్లు ఈసారి టైటిల్ గెలవడమె లక్ష్యంగా బరిలోకి దిగెందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్,  చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలబడబోతున్నాయ్ అని చెప్పాలి.

 ఇప్పటికే ఈ మెగా లీగ్ కోసం అన్ని జట్లు కూడా ప్రస్తుతం ప్రాక్టీస్ మొదలుపెట్టాయి అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇలా ఆయా జట్లకు సంబంధించిన ఆటగాళ్లు ప్రాక్టీస్ లో చెమటోడుస్తున్న వీడియోలు ఇక ఆయా ఫ్రాంచైజీ లు  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కొత్త కెప్టెన్ తో సరికొత్తగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బరిలోకి దిగబోతుంది. కాగా జట్టు ఆటగాళ్లు అందరూ కూడా ఉప్పల్ స్టేడియంలో నెట్స్ తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలోనే సన్రైజర్స్ బ్యాట్స్మెన్ హరీబ్రూక్ నెట్ ప్రాక్టీస్ వీడియోని జట్టు యాజమాన్యం ట్విటర్లో షేర్ చేసింది.

 నెట్స్ లో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటున్న హరి బ్రూక్స్ భారీ సిక్సర్లతో  విరుచుకుపడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఈ వీడియో సన్రైజర్స్ జట్టు అభిమానులందరినీ కూడా తెగ ఆకర్షిస్తుంది అని చెప్పాలి. కాగా గత ఏడాది చివరిలో జరిగిన మినీ వేళలో ఇంగ్లాండ్ విధ్వంసకర ఆటగాడు అయినా హ్యారి బ్రూక్ ని ఏకంగా 13.25 కోట్ల భారీ ధర వెచ్చించి మరి సన్రైజర్స్ కొనుగోలు చేసింది. మరి అతనిపై జట్టు యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని ఈ విధ్వంసకరమైన ఆటగాడు ఎలా నిలబెట్టుకుంటాడు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా ఈ ఏడాది ఐడెన్ మార్కరమ్ కెప్టెన్సీలో సన్రైజర్స్ బరిలోకి దిగబోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: