హార్థిక్ ఇగోని స్మిత్ టచ్ చేశాడు : డీకే

praveen
టీమిండియా సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ఇటీవల కాలంలో తన రివ్యూలతో సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన గురించి కూడా హాట్ హాట్ కామెంట్లు చేస్తూ ఉన్నాడు దినేష్ కార్తీక్. ఇటీవల ఇక ఆస్ట్రేలియా జట్టు సిరీస్ గెలుచుకోవడం పై స్పందిస్తూ.. తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన స్టీవ్ స్మిత పై ప్రశంసలు కురిపించాడు డీకే. చెపాక్ వేదికగా జరిగిన చివరి వన్డేలో స్మిత్ కెప్టెన్సీ స్పాట్ ఆన్ గా ఉందని.. మైదానంలో అతను అనుసరించిన వ్యూహాలు అద్భుతం అంటూ ప్రశంసల కురిపించాడు

 కాగా చివరి వన్డే మ్యాచ్లో 21 పరుగులు తేడాతో టీమ్ ఇండియాని ఓడించిన ఆస్ట్రేలియా 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా  ఇక వన్డే ఫార్మాట్లో నెంబర్ వన్ ర్యాంకును కూడా అందుకుంది అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై క్రిక్ బజ్  తో మాట్లాడాడు దినేష్ కార్తీక్. హార్దిక్ పాండ్యా ఇగోని టచ్ చేసి మరి స్మిత్ వికెట్ సాధించాడు అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. గేమ్ హోరాహోరీగా జరుగుతుండగా స్మిత్ తనదైన శైలిలో కాస్త తెలివిగా వ్యవహరించి ఫీల్డ్ లో మార్పులు తీసుకొచ్చాడు.

 అప్పటికే క్రీజులో సెట్ అయినట్లు కనిపిస్తున్న హార్దిక్ ను అవుట్ చేసేందుకు ఇక పదునైన వ్యూహాన్ని రచించాడు. హార్దిక్ ఈగో ని టచ్ చేసి మరి ఇక అతను తప్పు చేసేలా చేసి స్మిత్ వికెట్ సాధించాడు. స్ట్రైట్ లాంగ్ ఆన్ లో ఫీల్డర్ పెట్టాను దమ్ముంటే క్లియర్ చెయ్ అని తన చర్యలతో హార్దిక్ పాండ్యాకు స్మిత్ సవాల్ విసిరాడు. దీంతో హార్దిక్ పాండ్యా జంప  బౌలింగ్లో డీప్ స్క్వేర్ లెగ్ లో ఫీల్డర్ లేకున్నా స్వీట్ షాట్ ఆడకుండా సిక్స్ కొట్టాలని గట్టిగా అనుకున్నాడు. స్మిత్ కూడా ఇదే ఊహించి అతని రెచ్చగొట్టేలా ఫీల్డ్ సెట్ చేసి ఫలితాన్ని రాబట్టాడు అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk

సంబంధిత వార్తలు: