వరల్డ్ కప్ తుది జట్టుపై.. హింట్ ఇచ్చేసిన రాహుల్ ద్రావిడ్?

praveen
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే . అయితే ఈ వన్డే ప్రపంచ కప్ పైన ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టి ఉంది. ఎప్పుడెప్పుడు ఈ ప్రపంచకప్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదలవుతుందా అని ఎంతో మంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. అదే సమయంలో ఇక వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఈసారి విశ్వవిజేతగా నిలువబోయే జట్టు ఏది అన్న విషయంపై కూడా సోషల్ మీడియాలో ఎన్నో రివ్యూలు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి అని చెప్పాలి.

 దీంతో అటు క్రికెట్ ప్రేక్షకులు సైతం వరల్డ్ కప్ లో ఏ జట్టు గెలుస్తుంది ఇక ఆయా జట్లలో చోటు దక్కించుకోబోయే ఆటగాళ్లు ఎవరు అనే విషయంపై కూడా తెగ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో టైటిల్ ఫేవరెట్ గా టీమిండియా బరులోకి దిగుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారు అన్నది మాత్రం ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఇదే విషయంపై టీమిండియా హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ క్లారిటీ ఇచ్చాడు.

 భారత్ లో జరగబోయే 2023 వన్డే వరల్డ్ కప్ లో ఎవరిని ఆడించాలి అనే విషయంపై జట్టు యాజమాన్యం పూర్తి క్లారిటీతో ఉంది అన్న విషయాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. ఇప్పటికే 17 నుంచి 18 మందిని షార్ట్ లిస్ట్ చేసాము అంటూ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా తో సిరీస్ తర్వాత ఇక వరల్డ్ కప్ జట్టులో ఎవరు ఉంటారు అనే విషయంపై మరింత స్పష్టత వచ్చింది అంటూ తెలిపాడు.. గాయపడ్డ ఆటగాళ్లు కోలుకునే దాన్నిబట్టి కూర్పు విషయంలో మార్పులు ఉంటాయని చెప్పుకొచ్చాడు. అయితే సూర్య కుమార్ యాదవ్ రెండు మంచి బంతులకే అవుట్ అయ్యాడని.. ఇక అతడు నిరూపించుకునేందుకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సి ఉంది అంటూ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: