చేసిన తప్పేంటో.. కోహ్లీకి బాగా తెలుసు : గవాస్కర్

praveen
ఒకప్పుడు కోహ్లీ బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగాడు అంటే చాలు అతని బ్యాట్ నుంచి ఒక పెద్ద స్కోర్ వస్తుందని క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఆశించేవారు. సెంచరీ  రాకపోయినా కనీసం జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ తప్పకుండా వస్తుందని ఎంతోమంది నమ్మకం పెట్టుకునేవారు. ఇక విరాట్ కోహ్లీ ఇలా అభిమానులను నమ్మకాన్ని నిలబెడుతూ ఎప్పుడు జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చేవాడు. అందులో సెంచరీలు లేకపోయినా ఇక మంచి స్కోర్ మాత్రం కోహ్లీ చేసేవాడు అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో మాత్రం కోహ్లీ బ్యాటింగ్లో అలాంటి మెరుపులు ఎక్కడా కనిపించడం లేదు. ఎప్పుడో ఒకసారి సెంచరీ చేసి సరిపెట్టుకుంటున్నాడు అని చెప్పాలి.

 ఇక ప్రతిసారి కూడా అటు విరాట్ కోహ్లీ ఇక ఒకప్పటిలా మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించే లాగా భారీ పరుగులు చేయలేకపోతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు ఇలా వరుసగా వైఫల్యం చెందుతూ ఉండడం మాత్రం అటు జట్టుకు మైనస్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ వన్డే మ్యాచ్ లో కూడా కీలకమైన సమయంలో విరాట్ కోహ్లీ జట్టును ఆదుకోవాల్సింది పోయి వికెట్ కోల్పోయాడు. ముఖ్యంగా కోహ్లీ అవుట్ అయిన తీరుపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

 ఇక ఇటీవల ఇదే విషయంపై భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. రెండో వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసాడు. చేసిన తప్పేంటో విరాట్ కోహ్లీకి బాగా తెలుసు. ఇక ఇటీవలే చాలా మ్యాచులలో కూడా కోహ్లీ ఇలాగే అవుట్ అవుతున్నాడు. స్క్వేర్ లెగ్ వైపు ఆడేందుకు ప్రయత్నించడం వల్ల ఇలా జరుగుతుంది. మిడాన్ మీదుగా ఆడితే ఇబ్బందులు ఉండవు అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. కాగా మొదటి వన్డే మ్యాచ్ లోను విరాట్ కోహ్లీ ఇక ఇలాంటి బంతికే ఎల్పి అవుట్ గా వెను తిరిగాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: