ఐపీఎల్ 2023 : సన్రైజర్స్ కొత్త జెర్సీ ఇదే?

praveen
ఐపీఎల్ కు సంబంధించి భారత క్రికెట్ వర్గాల్లో హడావిడి మొదలైంది. మార్చి 31వ తేదీ నుంచి కూడా ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక అన్ని జట్లు కూడా గత ఏడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో కొత్త ఆటగాళ్ళను జట్టులోకి తీసుకున్నాయ్. ఈ క్రమంలోనే కొన్ని జట్లు మునుపటి కంటే మరింత పట్టిష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పాలి. ఇక స్టార్ ప్లేయర్లు జట్టులో చేరిపోవడంతో.. ఈసారి టైటిల్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి అన్ని జట్లు. అయితే ఇక ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ఇక కొన్ని ఫ్రాంచైజీలు తమ జట్టుకు సంబంధించి కొత్త జెర్సీని ప్రకటిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. పాత జెర్సీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇక కొత్త జెర్సీని ప్రకటిస్తూ ఉంటాయి.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఇప్పటికే కొత్త జెర్సీ వివరాలను ప్రకటించింది. ఇక ఇప్పుడు ఇక తెలుగు ప్రేక్షకుల జట్టుగా పేరున సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సైతం ఇక ఏడాది కొత్త జెర్సీతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇక ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్  యాజమాన్యం కొత్త జెర్సీనీ అధికారికంగా విడుదల చేసింది అని చెప్పాలి.ఈ క్రమంలోనే సన్రైజర్స్ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఇక కొత్త జెర్సీలో ఉన్న వీడియోని సన్రైజర్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

 కొత్త జెర్సీలో చూస్తే.. ఇక పాత జెర్సీలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది అన్నది మాత్రం అర్థం అవుతుంది. కాగా ఈ ఏడాది ఐడెం మార్గరమ్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు బరిలోకి దిగబోతుంది అన్న విషయం తెలిసిందే. కాగా  మార్కరమ్ సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్రైజర్స్ కు కప్పు అందించాడు. ఇక ఈసారి కూడా సన్రైజర్స్ కి టైటిల్ అందిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. కాగా ఏప్రిల్ 2వ తేదీన మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ తో తలబడబోతుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: