హమ్మయ్యా.. ఎట్టకేలకు కోహ్లీ టీమ్ గెలిచింది?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవక పోయినప్పటికీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పాలి. ఛాంపియన్ జట్లుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కంటే బెంగళూరు జట్టు ఒకే మద్దతు పలుకుతూ ఉంటారా అభిమానులు. కానీ ప్రతి ఏడాది భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ పేలువ ప్రదర్శన చేస్తూ నిరాశ పరుస్తూ ఉంటుంది బెంగళూరు టీం. జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్న కూడా ప్రతిసారి తమ వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఉంటుంది.

 అయితే 15 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీ లో ఒక్కసారి కూడా కప్పు గెలవని ఆర్సిబి కనీసం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అయినా బాగా రానించి టైటిల్ గెలుస్తుందని అభిమానులు భావించారు. బాగా రాణించాలని మద్దతు కూడా పలికారు. కానీ ఐపీఎల్ లో మించిన దారుణమైన వైఫల్యాన్ని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కొనసాగిస్తుంది బెంగళూరు జట్టు. స్మృతి మందాన సారధ్యంలో బరిలోకి దిగుతున్న బెంగళూరు జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో వరుసగా 4 పరాజయాలను  మూటగట్టుకుంది అని చెప్పాలి. దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. అయితే ఇక ఎట్టకేలకు ఆర్సిబి అభిమానులకు కొంత ఉపశమనం లభించింది.

 వరుస పరాజుయాలతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఎట్టకేలకు మొదటి విజయం సాధించింది. యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్లో ఆర్సిబి తొలి విజయాన్ని అందుకుంది. 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సిబి ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ లో అటు కెప్టెన్ స్మృతి మందాన మాత్రం డకౌట్ గా వెనుతిరిగింది అని చెప్పాలి. అయితే ఎట్టకేలకు వరుస ఓటమిల తర్వాత అటు ఆర్సీబీ మొదటి విజయం సాధించడంతో అభిమానులందరూ కూడా హమ్మయ్య ఇన్నాళ్ళకి ఒక విజయం వచ్చిందా అని ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl

సంబంధిత వార్తలు: