అందరూ దాని గురించే అడుగుతారు.. విసికెత్తిపోయా : కోహ్లీ

praveen
ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో భాగంగా ఫామ్ లో లేడు అంటూ విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు టీ20 వన్డే ఫార్మట్లలో సెంచరీ తో చెలరేగిపోయిన విరాట్ కోహ్లీ అటు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్లలో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడు అని అందరూ అనుకున్నప్పటికీ అలా జరగలేదు అని చెప్పాలి. దీంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ  టెస్ట్ ఫార్మాట్లో మాత్రం మునుపటి ఫామ్ అందుకోలేదు అంటూ అందరూ విమర్శలు గుర్తించారు.

 అయితే ఇక చివరి టెస్ట్ మ్యాచ్ లో మాత్రం సెంచరీ తో కథం తొక్కాడు విరాట్ కోహ్లీ. కీలకమైన సమయంలో బ్యాడ్ జులిపించి ఏకంగా 124 పరుగులు చేశాడు అని చెప్పాలి.  దీంతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. అయితే నాలుగో మ్యాచ్లో తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడు ఒకే మైండ్ సెట్ తో ఆడటం ఏ ఆటగాడికైనా మంచిది కాదు. పరిస్థితులకు అనుగుణంగానే బ్యాటింగ్ శైలిని కూడా మార్చుకోవాలి. అన్ని ఫార్మర్ లలో నేను రాణించడానికి ప్రధాన కారణం కూడా ఇదే అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటానికి నేను ఎప్పుడు మానసికంగా సిద్ధంగా ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు. నేను ఒకే ఓవర్ లో 6 డబుల్స్ కూడా తీయగలను. ఆ కారణం చేతనే విభిన్న పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయగలను అంటూ చెప్పుకొచ్చాడు.

 పరుగులు చేయడం నా మొదటి లక్ష్యం అందులో భాగంగానే సెంచరీలు వస్తూ ఉంటాయి. అయితే రికార్డుల కోసం మాత్రం ఎప్పుడూ ఆడను కానీ ఆటగాళ్లు చేసే సెంచరీకి ప్రాధాన్యత లభిస్తుంది. హోటల్ బాయ్ నుంచి బస్ డ్రైవర్ వరకు ప్రతి ఒక్కరు సెంచరీ గురించి అడుగుతారు. ఇక విని విని విసిగెత్తిపోయాను. చివరికి సెంచరీ చేయడం మాత్రం సంతోషాన్ని ఇచ్చింది అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే ఒక సెషన్ లో 30 పరుగులు చేసిన నేను సంతోషిస్తా.. అదే విధంగా బౌండరీలు కొట్టలేదని ఏమాత్రం నిరాశకు గురవను అంటూ కోహ్లీ తెలిపాడు. కఠిన పరిస్థితులను ఎదుర్కున్నప్పుడే మానసికంగా శారీరకంగా  దృఢంగా ఉన్నామో లేమో తెలుస్తుంది అంటూ విరాట్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: