రోనాల్డో ఇది కాస్త అతిగా లేదు.. ఫ్యాన్స్ ఆగ్రహం?

praveen
పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో ప్రస్తుతం వరస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల కాలంలో అల్- నసర్ క్లబ్ తో ఒప్పందం చేసుకున్న క్రిస్టియానో ఇలా వరుస విజయాలు సాధించడం విశేషం. ఇంతకు ముందు మాంచెస్టర్ యునైటెడ్ అనే క్లబ్ తో ఆడిన క్రిస్టియానో ఆ తర్వాత తెగదెంపులు చేసుకున్నాడు. వాస్తవానికి క్రిస్టియానో కి కోపం ఎక్కువ. తన అభిమానులను హృదయాలను గాయపడేలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొదట్లో ఒకటి రెండు మ్యాచ్ లలో ఓటమిని చవిచూసిన ఆ తర్వాత విజయాలతో దుమ్ము దులుపుతోంది. శుక్రవారం సౌదీ ప్రోలీగ్ లో భాగంగా మ్యాచ్ జరగగా క్రిస్టియానో టీం 1-0 తో ఓటమిని చవిచూసింది. ఇలా ఓటమి పాలవడంతో రోనాల్డో లోని పాత వ్యక్తి బయటకు వచ్చాడు. సహనాన్ని పూర్తిగా కోల్పోయాడు. పెవిలియన్ కు చేరుకుంటున్న సమయంలో క్రిస్టియానో తన ముందు కనిపించిన వాటర్ బాటిల్స్ ని కాలితో ఒక్కసారిగా కోపంగా తన్నాడు. వాటర్ బాటిల్స్ అన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. అందులో ఒక బాటిల్ స్టాండ్ లో ఉన్న అభిమానుల మధ్య పడింది. అయితే ఎవరికి గాయాలు కాలేదు, కాని ఇలాంటి ఒక ఘటనను ఫుట్ బాల్ ఫాన్స్ అందరు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మ్యాచ్ ఓడిపోతే ఏమవుతుంది, ఇంత కోపం ఎందుకు ? ఇలా కోపంలో ఆడటం వల్ల ఏమీ రాదు అంటూ రోనాల్డో కి హితబోధ చేస్తున్నారు. అయితే క్రిస్టియానో కి ఇంత కోపం రావడానికి  కారణం ఉందట. అల్- ఇత్తిహాద్ టీం అభిమానులు మ్యాచ్ జరుగుతున్నంత సేపు కూడా మెస్సి పేరు చెబుతూ రోనాల్డ్ లోకి కోపం తెప్పించారు. రోనాల్డో మరియు మెస్సి చాలా ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్నారు. అతడు కనిపించిన ప్రతిసారి మెస్సి పేరు చెప్పడం, గట్టిగా అరవడం వల్ల క్రిస్టియానో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత కాసేపటికి తాను చేసిన పనికి బాధపడుతూ అభిమానులు అందరికీ క్షమాపణ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: