నాలుగో టెస్టులో కోహ్లీ విశ్వరూపం.. 5 రికార్డులు దాసోహం?

praveen
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ.. చివరి టెస్ట్ మ్యాచ్లో తన విశ్వరూపం ఏంటో చూపించాడు అన్న విషయం తెలిసిందే. అప్పటికే కీలకమైన బ్యాట్స్మెన్లు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో.. టీమిండియా ముందు కొండంత లక్ష్యం ఉంది  అయితే ఈ కొండంత లక్ష్యాన్ని చూసి విరాట్ కోహ్లీ మాత్రం ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఎంతో ఆచీతూచి ఆడుతూనే పరుగులు రాబట్టాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత సెంచరీ చేసి అభిమానులందరినీ కూడా ఆనందంలో ముంచేసాడు. అయితే ఇక విరాట్ కోహ్లీ చివరి టెస్ట్ మ్యాచ్లో చేసిన 186 పరుగులతో ఎన్నో అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.. ఇక ఆ వివరాలు చూసుకుంటే..
 నాలుగో టెస్ట్ మ్యాచ్లో 186 పరుగుల ద్వారా టెస్ట్ ఫార్మాట్లో 28వ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఇక అత్యంత వేగంగా 75 ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించిన ప్లేయర్గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 566 ఇన్నింగ్స్ లలో 75 సెంచరీలు చేస్తే కోహ్లీ 552 ఇన్నింగ్స్ లోనే 75 సెంచరీల మార్కుల అందుకున్నాడు.

 ఇక స్వదేశంలో అత్యంత వేగంగా 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్ గా కూడా రికార్డు సృష్టించాడు. కేవలం 224 ఇన్నింగ్స్ లలోనే ఈ రికార్డును అందుకున్నాడు. గతంలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్  ఇద్దరూ ఈ రికార్డు సాధించారు అని చెప్పాలి. కాగా ఇండియా పిచ్ లపై కోహ్లీకి 35 సెంచరీలు, 51 అర్థ సెంచరీలు ఉన్నాయి.
 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో  అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్ గాను నిలిచాడు. నాలుగో టెస్టులో ఉస్మాన్ ఖవాజా చేసిన 180 పరుగులే అత్యధికంగా ఉండగా.. ఇక భారత ఇన్నింగ్స్  సమయంలో కోహ్లీ చేసిన 186 పరుగులు ఇక ఇప్పుడు అత్యధిక స్కోర్ గా కొనసాగుతుంది.
 కోహ్లీ ఇప్పుడు వరకు ఆస్ట్రేలియాపై ఏకంగా 4856 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ఈ లిస్టులో 6,707 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా 4714 పరుగులతో ఉన్న వెస్టిండీస్ దిగజం బ్రియాన్ లారా రికార్డును బ్రేక్ చేశాడు.

 వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2019లో ప్రారంభమైన డబ్ల్యూటీసీలో కోహ్లీ 52 ఇన్నింగ్స్ లలో 1797 పరుగులు చేశాడు. 36 ఇన్నింగ్స్ లో 1794 పరుగులు చేసిన రోహిత్ ను అధిగమించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: