వన్డే ఫార్మాట్ ను.. 40 ఓవర్లకు కుదించాలి : రవిశాస్త్రి

praveen
ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో టి20 ఫార్మాట్ తో ఎక్కువగా హవా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న యువ క్రికెటర్ల సైతం టి20 ఫార్మాట్లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అవసరమైతే మిగతా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం టి20 ఫార్మాట్లో మాత్రమే కొనసాగడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఇప్పుడు అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఫ్రాంచైజీ క్రికెట్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో.. ఈ ఫ్రాంచైజీ క్రికెట్ ద్వారా ప్రతిఒక్క క్రికెటర్ కోట్ల రూపాయలు సంపాదన పొందుతున్నాడు.

 వెరసి తక్కువ వేతనాలు ఉండే అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు చాలామంది ఆటగాళ్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీ20 ఫార్మాట్ కి క్రేజ్ పెరిగిపోతున్న నేపథ్యంలో.. వన్డే, టెస్ట్ ఫార్మాట్ మనుగడ ప్రమాదంలో పడిపోతుందని ఇప్పటికే ఎంతమంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై టీం ఇండియా మాజీ కోచ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్ ను 50 ఓవర్ల నుంచి 4 ఓవర్లకు కుదించాలి అంటూ అభిప్రాయపడ్డాడు. 1983 లో భారత్ ప్రపంచకప్ గెలిచిన సమయంలో వన్డే ఫార్మాట్ 60  ఓవర్ల పాటు జరిగిందని గుర్తు చేశాడు.

 కానీ ఆ తర్వాత కాలంలో వన్డేలపై అటు అభిమానులకు ఆసక్తి తగ్గిపోవడంతో 50 ఓవర్లకు కుదించారు. ఇక ఇప్పుడు వన్డే క్రికెట్ మనుగడను  కాపాడేందుకు 50 ఓవర్లను 40 ఓవర్లకు తగ్గించడమే సరైన నిర్ణయం అంటూ రవి శాస్త్రి పేర్కొన్నాడు. భవిష్యత్తులో వన్డే క్రికెట్ మనుగడ సాగాలంటే ఇక ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ తెలిపాడు. కాలానికి తగినట్లుగానే మన ఆలోచనలు కూడా మారాలి. వన్డే ఫార్మాట్లో 40 ఓవర్లకు  కుదించాలి అంటూ అభిప్రాయపడ్డాడు రవి శాస్త్రి. ఇక అంతర్జాతీయ టి20 గురించి మాట్లాడుతూ... ప్రతి ఒక్క ఆటగాడికి టి20 క్రికెట్ కీలకమైనప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా దేశీయ లీగులు ఎక్కువైనందున టీ20 ద్వైపాక్షిక సిరీస్లను కూడా తగ్గించాలి అంటూ వ్యాఖ్యానించాడు రవి శాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: