ప్యాట్ కమిన్స్ ను తప్పించి.. అతన్ని కెప్టెన్ చేస్తే బెటర్ : బ్రాడ్ హాగ్

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్  ట్రోఫీలో భాగంగా వరుసగా టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్ ముగిసాయ్. ఇప్పుడు అహ్మదాబాద్  లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అటు నాలుగవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి. అయితే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. పటిష్టమైన ఆస్ట్రేలియాను చిత్తుగా  ఓడించి ఘన విజయాలను అందుకుంది అని చెప్పాలి. అయితే రెండు టెస్టులు ముగిసిన తర్వాత అటు ఆస్ట్రేలియా కు మరో షాక్ తగిలింది.

 జట్టుకు కెప్టెన్ గా ఉన్న ప్యాట్ కమిన్స్ వ్యక్తిగత పనుల నిమిత్తం  అటు స్వదేశానికి పయనం అయ్యాడు అని చెప్పాలి. దీంతో వైస్ కెప్టెన్ గా ఉన్న స్మిత్  సారధ్య బాధ్యతలను అందుకొని జట్టును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే మూడో మ్యాచ్లో స్మిత్ సారథ్యంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఘన విజయాన్ని అందుకుంది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోవడం గమనార్హం. ఇప్పుడు నాలుగో టెస్ట్ మ్యాచ్లో కూడా అదే రీతిలో ప్రదర్శన చేస్తుంది ఆస్ట్రేలియా జట్టు. అయితే రెగ్యులర్ కెప్టెన్ ఉన్నప్పుడు ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లలో ఓడిపోతే ఇక తాత్కాలిక కెప్టెన్ స్మిత్ సారధ్యంలో మాత్రం మొదటి మ్యాచ్ లోనే గెలిచింది ఆస్ట్రేలియా.

 దీంతో కెప్టెన్సీ విషయంపై ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ బ్రాడ్ హాగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తాత్కాలిక కెప్టెన్ గా కొనసాగుతున్న స్టీవ్ స్మిత్ కి  శాశ్వతంగా కెప్టెన్సీ అప్పగించాలని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్యాట్ కమిన్స్ మూడు ఫార్మట్ లలో కెప్టెన్సీ తో ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. బౌలర్ల కంటే బ్యాటర్లపై కెప్టెన్సీ ఒత్తిడి కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే ప్యాట్ కమిన్స్ కి బదులు ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ ని స్మిత్ కి అప్పగిస్తే బాగుంటుంది అంటూ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: