క్రికెట్ రూల్స్ లో.. స్మిత్ లూప్ హోల్ ని ఉపయోగించాడు : పార్థివ్ పటేల్

praveen
ఆస్ట్రేలియా , భారత్ మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా టీమ్ ఇండియాను సొంత దేశంలోనే చిత్తు చేసి తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా. జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఫ్యాట్ కమిన్స్ వ్యక్తిగత పనుల నిమిత్తం స్వదేశానికి పయనమైన ఇక జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికీ కూడా అటు ఆస్ట్రేలియా పట్టు విడవకుండా పోరాడి చివరికి విజయం సాధించింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది అని చెప్పాలి.

 ఒక రకంగా చెప్పాలి అంటే రెగ్యులర్ కెప్టెన్ లేని సమయంలో ఇక ఆస్ట్రేలియా జట్టు సారధ్య బాధ్యతలు చేపట్టిన సీనియర్ బాటర్ స్టీవ్ స్మిత్ మీద తన కెప్టెన్సీ వ్యూహాలతో మ్యాజిక్ చేశాడు అని చెప్పాలి. అయితే కీపర్ స్టంప్స్ ని గిరాటేసిన ప్రతిసారి కూడా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎంతో కాన్ఫిడెంట్ గా అప్పీల్ చేయడం మూడో టెస్ట్ మ్యాచ్లో కనిపించింది. ఇది కరెక్టేనా అని ఇటీవలే ఒక టాక్ షోలో మాజీ వికెట్ కీపర్ పార్దివ్ పటేల్ ని ఒక నెటిజన్ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు. పార్థివ్ పటేల్ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ రూల్స్ లో ఉన్న ఒక లూప్ హోల్ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు.

 సాధారణంగా ఎప్పుడైనా స్టంపింగ్ కోసం అప్పీలు చేస్తే ఫీల్డ్ ఎంపైర్.. థర్డ్ అంపైర్ సహాయం కోరితే ప్రాసెస్ ప్రకారం చెక్ చేసుకుంటూ రావాలి. అప్పుడు బ్యాట్స్మెన్ బంతిని ఎడ్జ్ చేశాడా లేదా అన్న విషయం కూడా చూడాలి. కాని దీనిపై స్మిత్ కి పూర్తిగా అవగాహన ఉంది. ఇక దానినే ఉపయోగించుకున్నాడు. ఇలాంటి సమస్యకు రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఫీల్డ్ ఎంపైర్ తన నిర్ణయం పై నమ్మకంతో ఉన్నప్పుడు థర్డ్ అంపైర్ కు నివేదించకూడదు. అలా కాకుండా రెండో మార్గం కూడా ఉంది. ఫీల్డింగ్ జట్టును స్టంపింగ్ కోసం అప్పీల్ చేస్తే కేవలం దానిని మాత్రమే చెక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ క్యాచ్ అవుట్ కూడా సమీక్షించాలంటే తప్పనిసరిగా డిఆర్ఎస్ కూడా తీసుకోవాలి. క్యాచ్ ఎల్బి కోసం అప్పీల్ చేస్తే కేవలం వాటి వరకేచెక్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి లూప్ హోల్స్ ని వినియోగించుకొని స్మిత్ జట్టును గెలిపించాడు అంటూ పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: