గుడ్ న్యూస్ : బుమ్రా లేకపోతే ఏంటి.. అతనొచ్చేశాడు?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా ఛాంపియన్ టీమ్ గా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ సారథ్యంలో తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. అలాంటి ముంబై ఇండియన్స్ కి గత ఏడాది చేదు అనుభవం ఎదురయింది. ఛాంపియన్ టీం అయినప్పటికీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టలేక టోర్నీ నుండి నిష్క్రమించింది అని చెప్పాలి. అయితే ఇక ఈ ఏడాది మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేసి మళ్లీ టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది. మార్చి 31వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఆట తీరుపై అందరూ అంచనాలు పెట్టుకుంటున నేపథ్యంలో ఇక ఈ జట్టుకు ఊహించని షాక్ లు తగులుతున్నాయి. జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న బుమ్రా ఇక ఐపీఎల్ సీజన్ కి మొత్తం దూరంగా ఉండబోతున్నాడు అన్న వార్త అభిమానులందరని కూడా ఆందోళనలో ముంచేస్తుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అందింది. 2022 మెగా వేలంలో 8 కోట్ల భారీ ధర పెట్టి మరి స్టార్ పెసర్ ఇంగ్లాండ్ ప్లేయర్ అయినా  ఆర్చర్ ను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. గత ఏడాది సీజన్ కు గాయం కారణంగా అతను దూరంగా ఉంటాడని తెలిసినప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అతన్ని జట్టులోకి తీసుకుంది.

 అయితే ఇక ఇప్పుడు గాయం నుంచి కోలుకొని మళ్ళీ అతను క్రికెట్ ఆడటానికి మైదానంలోకి దిగాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కూడా ఆడబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే స్టార్ బుమ్రా అందుబాటులో ఉండడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్చర్ కు సంబంధించిన గుడ్ న్యూస్ మాత్రం ముంబై యాజమాన్యానికి, ఫాన్స్ కు కూడా ఊరట కలిగిస్తుంది అని చెప్పాలి.. కాగా ఆర్చర్ దాదాపు గాయం కారణంగా 18 నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు అని చెప్పాలి. కాగా గాయం తర్వాత పునరాగమనం చేసిన ఆర్చర్ ఇక మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: