రోహిత్ వారసుడు సిద్ధమవుతున్నాడు.. నెక్స్ట్ కెప్టెన్ ఎవరో కాదు?

praveen
రెండుసార్లు ప్రపంచ కప్ ను ముద్దాడిన భారత్కు ఇక ఇప్పుడు మూడో ప్రపంచకప్ గెలవడానికి మాత్రం నిరీక్షణగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ప్రపంచ ఛాంపియన్ కే అటు వరల్డ్ కప్ టైటిల్ అందని ద్రాక్షలా మారిపోయింది అని చెప్పాలి. ఇక టీమ్ ఇండియాకు కెప్టెన్లు మారుతున్న అటు వరల్డ్ కప్ గెలవాలనే కల మాత్రం సహకారం కావడం లేదు. అయితే ఈ ఏడాది మాత్రం టీమిండియా తప్పకుండా వరల్డ్ కప్ గెలిచి తీరుతుంది అని ప్రస్తుతం క్రికెట్ నిపుణులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.

 గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ వరకు విజయవంతంగా దూసుకు వెళ్లిన టీమిండియా జట్టు ఇక సెమి ఫైనల్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి వెనుదిరిగింది. అయితే ఇక ఈసారి వరల్డ్ కప్ లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో విశ్వవిజేతగా నిలవాలని టీమ్ ఇండియా చూస్తుంది. అయితే ఇక ఈ వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని ప్రచారం ప్రస్తుతం జోరుగా జరుగుతుంది. ప్రస్తుతం 35 ఏళ్ల వయస్సున్న రోహిత్ శర్మ ను కెప్టెన్ గా కొనసాగించడం కష్టమే అని మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు.

 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ వారసుడు టీమిండియాలో సిద్ధమవుతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇప్పటికే టీ20 లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా రోహిత్ కెప్టెన్సీ రిటైర్మెంట్ తర్వాత అటు వన్డేలకు కూడా సారథ్యం వహించే అవకాశం ఉంది. గత కొంతకాలం నుంచి సీనియర్లను టి20 ఫార్మాట్ నుంచి పూర్తిగా పక్కన పెట్టేసింది టీమిండియా యాజమాన్యం. ఇక వచ్చిన అవకాశాన్ని పాండ్యా కూడా చక్కగా వినియోగించుకుంటున్నాడు. అతడు మహేంద్ర సింగ్ ధోని శిష్యుడు కావడం గమనార్హం. ఇక ఇప్పుడు హారతిక్ పాండ్య వారసుడిగా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోయేది కూడా అతని అన్నది తెలుస్తోంది.ఇక కెప్టెన్సీ రేస్ లో ప్రస్తుతం అందరి కంటే పాండ్యనే ముందున్నాడు అన్నది మాత్రం స్పష్టమవుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: