సిక్సర్లు కొట్టడంలో.. ధోని రికార్డు బ్రేక్ చేసిన బౌలర్?

praveen
న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌదీ గత కొంతకాలం నుంచి కూడా అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ఉన్నాడు అన్న తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించడమే కాదు మరోవైపు ఇక ఒక ఆటగాడిగా కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రత్యర్ధులకు వణుకు పుట్టించే విధంగా  ప్రదర్శన కూడా చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక భారీ ఇన్నింగ్స్ లు ఆడుతూ ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటున్నాడు టిమ్ సౌదీ.

 ఇకపోతే ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు తమ దేశ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతుంది. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం జట్టు సారాధ్య బాధ్యతలు నిర్వహిస్తున్న టిమ్ సౌదీ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ లో కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు టిమ్ సౌదీ.  సిక్సర్లు కొట్టడంలో ఇలా ధోని రికార్డును బ్రేక్ చేశాడు అని చెప్పాలి.

 సాధారణంగా అయితే టిమ్ సౌదీ ఫేస్ బౌలర్ అనే విషయం తెలిసిందే. కానీ టెస్ట్ క్రికెట్లో మాత్రం స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోను టిమ్ సౌదీ మంచి ప్రదర్శన కనబరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి.  కాగా మహేంద్ర సింగ్ ధోని 144 టెస్ట్ ఇన్నింగ్స్ లలో 78 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టిస్తే.. అటు టిమ్ సౌదీ మాత్రం 131 టెస్ట్ ఇన్నింగ్స్ లోనే 78 సిక్సర్ల  మార్కు అందుకున్నాడు. ఇలా పేస్ బౌలర్ గానే కాకుండా బ్యాట్స్మెన్ గా కూడా మంచి ప్రదర్శన చేస్తూ జట్టును విజయతీరాలకు నడిపిస్తున్న టీంటిమ్ సౌదీ పై ప్రస్తుతం ఆ దేశ మాజీ ఆటగాళ్లందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: