రషీద్ ఖాన్ మనిషా రోబోనా.. అసలు ఇదెలా సాధ్యం?

praveen
ఇటీవల కాలంలో ఫ్రాంచైజీ  క్రికెట్కు క్రేజ్ పెరిగిపోయిన నేపథ్యంలో ఎంతో మంది స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లో కనిపించడం గగనంగా మారిపోయింది. ఒకవేళ ఆడిన ఏదో ఒక ఫార్మాట్ కి మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప మూడు ఫార్మట్లలో మాత్రం కనిపించడం లేదు. ఒకవేళ మూడు ఫార్మాట్ లలో ఉన్న విశ్రాంతి పేరుతో ఎక్కువ శాతం రెస్ట్ మోడ్ లోనే ఉంటున్నారు అని చెప్పాలి.

అయితే ఇలాంటి సమయంలో అటు ఆఫ్ఘనిస్తాన్ టి20 జట్టు కెప్టెన్ గా ఉన్న రషీద్ ఖాన్ మాత్రం ఒకవైపు జాతీయ జట్టుకు ఆడటాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే ఇక ప్రపంచ నలుమూలలో జరిగే అన్ని ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లలో కూడా పాల్గొంటున్నడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే విరామం లేకుండా అతను క్రికెట్ ఆడుతున్న తీరు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా నిర్కాంత పోయేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతను బిజీ షెడ్యూల్ చూసి అతను మనిషా లేకపోతే రోబో నా.. ఇలా అలుపెరుగకుండా ఎలా ఆడగలుగుతున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

గత ఏడాది డిసెంబర్ 14 నుంచి ఈ ఏడాది జనవరి ఐదు వరకు కూడా ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాష్ లీగ్ లో పాల్గొన్నాడు రషీద్ ఖాన్. తర్వాత జనవరి 10 నుంచి ఫిబ్రవరి 6 వరకు సౌత్ ఆఫ్రికాలో జరిగిన టి20 లీగ్ లో ఆడాడు. ఆ తర్వాత వెంటనే  ఫిబ్రవరి 9 నుంచి దుబాయ్ బయలుదేరి అక్కడ ఇంటర్నేషనల్ టి20 లీగ్ లో పాల్గొన్నాడు. ఇక ఆ తర్వాత ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఆఫ్గానిస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలోనే ఇక ఆఫ్గానిస్థాన్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో పాల్గొన్నాడు. ఇది ముగిసిన వెంటనే రెండు రోజుల గ్యాప్లో పాకిస్తాన్ లో వాలిపోయిన రషీద్ ఖాన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మళ్ళీ ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: