వరల్డ్ కప్ 2023: సౌత్ ఆఫ్రికా దెబ్బకు బెదిరిన ఇంగ్లాండ్ !

VAMSI
సౌత్ ఆఫ్రికా వేదికగా గత 15 రోజులుగా మహిళల టీ 20 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం టైటిల్ కోసం 10 జట్లు పోటీ పడగా, చివరికి రెండు జట్లు మాత్రమే మిగిలాయి. లీగ్ స్టేజ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా, ఇండియా , ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. మొదటి సెమీఫైనల్ లో తృటిలో ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఇంటి బాట పట్టింది. ఇక గత రాత్రి జరిగిన రెండవ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ మరియు ఆతిథ్య సౌత్ ఆఫ్రికాలు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలుస్తుందని క్రికెట్ పండితులు అంతా అంచనా వేశారు.
కానీ క్రికెట్ లో ఎప్పుడు ఏమి జరుగుతుంది అన్నది ఎవ్వరూ ఊహించలేరు. సరిగ్గా నిన్న మ్యాచ్ లోనూ అదే జరిగింది. మొదట టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ సన్ లస్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట ఊహించిన విధంగానే సౌత్ ఆఫ్రికాకు విజయం దక్కాలంటే ఓపెనర్లు ఎఫెక్టివ్ గా ఆడితేనే సాద్యం అవుతుంది... ఇద్దరూ కూడా మొదటి నుండి ఫియర్ లెస్ ఆటతో ఇంగ్లాండ్ బౌలర్లపై అటాక్ చేశారు. బ్రిట్స్ (68) మరియు వోల్వర్ట్ (53) లు మొదటి వికెట్ కు 96 పరుగులు జోడించారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా మహిళలు మరింత చెలరేగి నిర్ణీత ఓవర్ లలో 164 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
165 పరుగుల టార్గెట్ ను చేధించడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు డంక్లీ  మరియు వ్యాట్ లు మొదటి వికెట్ కు 5 ఓవర్లలోనే 53 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాకు చెమటలు పట్టించారు. ఆ తర్వాత వరుసగా వికెట్ లను తీసి ఇంగ్లాండ్ పై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేసినా నటాలీ సీవర్ మరియు నైట్ లు మరో వికెట్ పడకుండా ఇంగ్లాండ్ ను విజయానికి చేరువ చేశారు. అప్పుడే సౌత్ ఆఫ్రికా బౌలర్లు అద్బుతం చేసి వరుస వికెట్లను తీసి చరిత్రలో తొలిసారి సౌత్ ఆఫ్రికా ను ఫైనల్ కు చేర్చారు. దీనితో ఇంగ్లాండ్ అభిమానులు షాక్ అయ్యారు. ఎవ్వరూ ఊహించని ఈ సడన్ షాక్ కు ఇంగ్లాండ్ జట్టు లో సభ్యులు అంతా ఏడవడం మొదలు పెట్టారు. అలా సెమీఫైనల్ 2 లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ను చావు దెబ్బ కొట్టి ఘనంగా ఆస్ట్రేలియా తో ఫైనల్ ఆడడానికి సిద్దమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: