ఎట్టకేలకు సాధించిన సౌతాఫ్రికా.. తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ కీ?

praveen
సాధారణంగా క్రికెట్ అంటేనే ఊహకిందని ఘటనలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఎవరు గెలుస్తారు అన్నది కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఒక జట్టు గెలుస్తుందని క్రికెట్ ప్రేక్షకులు అందరూ గట్టిగా నమ్మినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఓడిపోతుంది అనుకున్న జట్ట అద్భుతంగా రానించి ఇక ప్రత్యర్థిని ఓడించి విజయం సాధించడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అందుకే క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ముందుగానే ఊహించడం చాలా కష్టం. ఒకవేళ ముందుగానే ఊహించిన అది కచ్చితంగా నిజం అవుతుంది అని కూడా చెప్పలేం. ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో కూడా ఇదే జరిగింది.

 టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన అన్ని జట్లు లీగ్ దశలో మంచి ప్రదర్శన చేసి సెమీఫైనల్కు చేరుకున్నాయ్. అయితే సెమీఫైనల్ లో మాత్రం ఫైనల్ వెళ్తుంది అనుకున్న జట్టు ఓడిపోయి ఇంటిపాటు పడితే ఇక ఓడిపోతుంది అనుకున్న జట్టు సెమి ఫైనల్లో విజయం సాధించి మొదటిసారి అటు మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్లో అడుగు పెట్టింది అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు ఇక ఈ అరుదైన ఘనత సాధించింది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగానే వరల్డ్ కప్ టోర్నీ జరుగుతూ ఉండడం ఆ జట్టుకు బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే స్వదేశీ పరిస్థితిలను బాగా వినియోగించుకున్న జట్టు సెమి ఫైనల్ పటిష్టమైన ఇంగ్లాండును ఓడించి ఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి.

 అయితే సౌత్ ఆఫ్రికా జట్టు అటు లీగ్ దశలో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. సునే ఆస్ సారధ్యంలో బలిలోకి దిగిన సఫారీ జట్టు లీగ్ దశలో జరిగిన నాలుగు మ్యాచ్ లలో కూడా రెండు మ్యాచ్ లలో గెలిచి ఇక రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది అని చెప్పాలి. కానీ ఇక సౌత్ ఆఫ్రికాకు మెరుగైన రేట్ ఉండడం కారణంగా ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా సెమీఫైనల్ లో అడుగు పెట్టింది. ఇప్పుడు సెమీఫైనల్ లో పటిష్టమైన ఇంగ్లాండు జట్టును ఓడించి ఫైనల్ అడుగుపెట్టింది. ఇలా సౌత్ ఆఫ్రికా ఫైనల్ కు చేరడం ఇదే మొదటిసారి. కాగా ఆదివారం ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: