ఆ ఇద్దరి నుంచే కెప్టెన్సీ స్కిల్స్ నేర్చుకున్నా : మార్కరమ్

praveen
గత కొంతకాలం నుంచి వరుసగా కెప్టెన్లను మారుస్తూ అభిమానులందరికీ షాకులు ఇస్తూ వస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం ఇక ఇటీవల మరో కొత్త కెప్టెన్ ను అధికారికంగా ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. డేవిడ్ వార్నర్ ను కెప్టెన్గా తప్పించి కేన్ విలియమ్సన్ కు సారధ్య బాధ్యతలు అప్పగించిన సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.. గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలానికి ముందు కేన్ విలియమ్సన్ ను  కూడా  వేలంలోకి వదిలేసింది. అయితే మళ్ళీ తక్కువ ధరకు కొనుగోలు చేస్తుందని అందరూ అనుకున్నారు.

 కానీ అలా జరగలేదు అని చెప్పాలి. ఇక కేన్ విలియమ్సన్ ను మరో జట్టు సొంతం చేసుకుంది. దీంతో ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్తగా కెప్టెన్ అయ్యేది ఎవరు అన్న విషయంపై ఆసక్తి నెలకొంది.. అయితే గత సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్న మయాంక్ అగర్వాల్ ను భారీ ధరకు జట్టులోకి తీసుకున్న నేపథ్యంలో అతనికి కెప్టెన్సీ అప్పగించడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఊహించిన రీతిలో దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ అయిన మార్క్ రమ్ కు ఇక కెప్టెన్సీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా మార్కరమ్ సన్రైజర్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్గా వ్యవహరించి మొదటి ప్రయత్నంలోనే టైటిల్ అందించాడు.

 అందుకే కెప్టెన్సీ విషయంలో అతని వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. కాగా తనకు కెప్టెన్సి దక్కడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మార్కరమ్. సన్రైజర్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. జట్టును విజయవంతంగా ముందుకు నడిపించడానికి 100% ప్రయత్నిస్తాను. సన్రైజర్స్ జట్టుకి అభిమానులు ఎక్కువగానే ఉంటారు. అందుకే వారందరిని సంతృప్తిపరిచేందుకు గట్టిగానే ప్రయత్నించాలి. ఇక జాతీయ జట్టుకు ఆడేటప్పుడు డుప్లేసెస్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్న.. ఒక సారథిగా ఎలా ఉండాలో తెలుసుకున్నా. సన్రైజర్స్ లో ఆడినప్పుడు కెన్ విలియమ్సన్ నుంచి కూడా ఎన్నో కెప్టెన్సీ స్కిల్స్ నేర్చుకున్నాను. డుప్లెసిస్, విలియమ్సన్ ఇద్దరూ కూడా కెప్టెన్సీ   వహిస్తున్న సమయంలో ఎంతో కూల్ గా ఉంటూ ఆటగాళ్లకు మద్దతు ఇస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతూ ఉంటారు అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: