మహిళ వలన గర్భం దాల్చిన మహిళా క్రికెటర్ సారా టేలర్ !

VAMSI
" data-original-embed="" >

నేటి కాలంలో లింగంతో సంబంధం లేకుండా మనసులు కలిస్తే చాలు జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడుతున్న వారిలో సామాన్యులు , సెలెబ్రిటీలు చాలా మంది ఉన్నారు. కానీ సెలెబ్రిటీలు ఇలా చేస్తే వెంటనే సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతుంది. అటువంటి ఒక ఉదాహరణే.. ఇంగ్లాండ్ కు చెందిన మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ డయానా అనే మహిళతో కలిసి కొంతకాలంగా సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈమె లాగే ప్రస్తుతం ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు నటాలీ సివర్ మరియు బ్రాంట్ లు పెళ్లి చేసుకుని సంసారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా టేలర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
వీరిద్దరూ ఈ అద్భుతమైన విషయాన్ని పంచుకుంటూ తమ ఆనందాన్ని తెలిపారు. మరో 19 వారాలు గడిస్తే మేము తల్లి కాబోతున్నామంటూ హ్యాపీ గా ఈ వార్తను షేర్ చేసింది. గత రెండు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ లో సారా టేలర్ ఒక సంచలనం అని చెప్పాలి. ఈమె క్రికెట్ నుండి తప్పుకునే ముందు వరకు అంతర్జాతీయంగా 10 టెస్ట్ లు ఆడి 300 పరుగులు, 126 వన్ డే లలో 4056, 90 టీ 20 లలో 2177  ఇంగ్లాండ్ కు ప్రాతినిధ్యం వహించింది. సారా టేలర్ 2019 లో క్రికెట్ నుండి తప్పుకుంది, ఆ తర్వాత అసిస్టెంట్ కోచ్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం.
ఇంగ్లాండ్ టీం లో బెస్ట్ కీపర్ గా ఈమె మన్ననలు అందుకుంది. అంతే కాకుండా రెండు సార్లు సారా టేలర్ ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ గా ఎంపికయింది. కానీ ఒక మహిళా క్రికెటర్ గా ఎంతో క్రీడా భవిష్యత్తు ఉన్నప్పటికీ మానసిక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కేవలం 30 సంవత్సరాల వయసులోనే వీడ్కోలు పలికి అందరికీ షాక్ ఇచ్చింది టేలర్. అయితే మళ్ళీ 2016 లో జట్టులోకి వచ్చినా సరిగా రాణించలేక ముగింపు పలికింది.
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: