పిచ్ సమస్య కాదు.. వాళ్ళిద్దరే ఆస్ట్రేలియాని ఓడించారు : చాపెల్

praveen
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇక భారత గడ్డపై వరుసగా టెస్టు సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే భారత పర్యటనకు వచ్చే ముందు వరకు కూడా ఎంతో పటిష్టంగా కనిపించిన ఆస్ట్రేలియా జట్టు ఇండియా గడ్డపై అడుగు పెట్టిన తర్వాత మాత్రం ఎందుకో అంత పటిష్టంగా కనిపించడం లేదు అనేది తెలుస్తుంది. ఎందుకంటే భారత జట్టును ఓడించడం అటు ఆస్ట్రేలియా జట్టుకు ఎక్కడ సాధ్యం కావడం లేదు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇప్పుడు వరకు భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా భారత జట్టే ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. మొదటి మ్యాచ్లో 132 పరుగులు తేడాతో విజయం సాధించిన టీమిండియా రెండవ మ్యాచ్ లో ఆరు వికెట్ల  తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. అయితే భారత స్పిన్ బౌలింగ్ ముందు అటు ఆస్ట్రేలియా ఎక్కడ నిలబడలేకపోతుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగం మొత్తం పేక మెడల కూలిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఇక వరుసగా ఆస్ట్రేలియా ఓటమి పాలు అవ్వడంపై ఎంతో మంది ఆ దేశ మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తున్నారు.

 కొంతమంది ఎప్పటిలాగానే భారత్లో ఉన్న పిచ్ ల గురించి విమర్శలు చేస్తూ ఉంటే.. మరి కొంతమంది మాత్రం ఇక భారత ప్రదర్శన పై ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవలే ఇదే విషయంపై ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపల్ స్పందించాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పలు పెడుతున్న బౌలర్లు అశ్విన్ జడేజాలపై ప్రశంసలు కురిపించాడు. రెండో టెస్టులో ఈ స్పిన్ ద్వయం అద్భుతంగా రాణించారు. పిచ్ ఎలా ఎలా ఉన్నా కూడా అద్భుతంగా బౌలింగ్ చేయగల సత్తా అశ్విన్ కు ఉంది. ఫలితం ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసు. ఆస్ట్రేలియాలోనూ అశ్విన్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. జడేజా అంత నైపుణ్యం కలిగిన బౌలర్ కాకపోయినా ఎప్పటికప్పుడు తన స్కిల్స్ ని మెరుగుపరుచుకుంటున్నాడు అంటూ ఇయాన్ చాపెల్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: