ఐపీఎల్ 2023 ఫుల్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. ఇక రోజులు లెక్కపెట్టుకోండి డ్యూడ్ !

VAMSI
" data-original-embed="" >

గత 15 సీజన్ ల నుండి ప్రపంచం అంతటా ఉన్న కోట్ల మంది క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఏకైక టీ 20 లీగ్ ఇండియా ప్రీమియర్ లీగ్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అన్ని దేశాల క్రికెటర్లు వచ్చి ఇండియాలో జరిగే ఈ లీగ్ లో పాల్గొని ఆటలో మరింతగా పరిణితి చెందుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే అనామక క్రికెటర్ల జీవితాలను రాత్రికి రాత్రే మార్చేసిన ఘనత ఈ పొట్టి ఐపీఎల్ కు ఉంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే ఆ సమయం రానే వచ్చేసింది... కాసేపటి క్రితమే బీసీసీఐ 2023 కు సంబంధించిన ఐపీఎల్ షెడ్యూల్ ను విడుదల చేసి ప్రేక్షకులలో నూతన ఉత్సాహాన్ని నింపింది.
తాజాగా విడుదల చేసిన ఐపీఎల్ 2023 షెడ్యూల్ ప్రకారం ఈ ధనాధన్ లీగ్ మార్చ్ 31 నుండి మొదలు కానుంది, ఈ లీగ్ లో మొత్తం 70 మ్యాచ్ లు జరిగానున్నాయి.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ మే 21 న జరగనుండగా.. ఫైనల్ మ్యాచ్ మాత్రం మే 28 న జరుగ్తుతుంది. అందులో 18 డబుల్ హెడర్ మ్యాచ్ లు ఉన్నాయి. ఎప్పటిలాగే ప్రతి టీం తమ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ లు మరియు ఇతర టీం హోమ్ గ్రౌండ్ లలో 7 మ్యాచ్ లు ఆడనుంది. గత సీజన్ నుండి ఐపీఎల్ లో మొత్తం టీం లు ఉన్న సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ మరియు లక్నో సూపర్ జాయింట్స్ లు కొత్తగా ఐపీఎల్ కు జత చేయబడ్డాయి. ఐపీఎల్ లో పోటీ చేసిన మొదటి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ జట్టు ఛాంపియన్ గా నిలవడం విశేషం.
ఈ జట్టును ఎంతో సక్సెస్ ఫుల్ గా కెప్టెన్ హార్దిక్ పాండ్య ముందుండి నడిపించాడు. ఐపీఎల్ 2023 లో మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ లు అహ్మదాబాద్ లో ఆడనున్నాయి. మరి క్రికెట్ ప్రేమికులు అంతా ఇక రోజులు లెక్కపెట్టుకోండి. మరో 42 రోజుల్లో ఐపీఎల్ 2023 ఘనంగా స్టార్ట్ కానుంది. ఈ సారి టైటిల్ ను ఎవరు దక్కించుకోనున్నారో చూడాలి.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: