టీమిండియా సాలిడ్ విజయం.. ఆ ప్లేయర్ బ్యాటింగ్ విధ్వంసం?

praveen
మరికొన్ని రోజుల్లో భారత మహిళల జట్టు అటు టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే తమ ప్రత్యర్థులు ఎవరు అన్న విషయం పై క్లారిటీ రావడంతో ఇక ఆయా జట్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంది భారత మహిళల జట్టు. అయితే ఇక ఈసారి ప్రపంచకప్ ను ముద్దాడటమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ టి20 మహిళల వరల్డ్ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుండగా ఫిబ్రవరి 12వ తేదీన భారత మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థి  అయిన పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడబోతుంది.

 ఇక ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక అఫీషియల్ మ్యాచులు ప్రారంభం కావడానికి ముందు ప్రస్తుతం వార్మప్ మ్యాచ్లతో బిజీబిజీగా గడుపుతుంది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే వార్మప్ మ్యాచ్లలో కూడా ప్రత్యర్థులపై పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది అని చెప్పాలి.. ఇక ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 52 పరుగుల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది టీం ఇండియా జట్టు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో భాగంగా టీమిండియా మహిళల జట్టులో కీలక బ్యాటర్ గా కొనసాగుతున్న రీఛాగోష్ బ్యాటింగ్ విధ్వంసం కాస్త వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 బంగ్లాదేశ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్లో రీఛాగోష్ తన బ్యాట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. తనకు బౌలింగ్ చేస్తూ ఉంది ఏ బౌలర్ అయిన పట్టించుకోకుండా సిక్సర్లు ఫోర్ లతో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే 56 బంతుల్లోనే 91 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక రిచాగోష్ ఇన్నింగ్స్ లో తొమ్మిది సిక్సర్లు మూడు ఫోర్లు ఉండడం గమనార్హం. అయితే రిచా గోష్ ఆడిన చివరి పది బంతుల్లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టింది అని చెప్పాలి.  రిఛాగోష్ విజృంభించడంతో   భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. చివరికి ప్రత్యర్థిని కట్టడి చేయడంతో 52 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: