ఇండియా స్పిన్నర్ల దెబ్బకు... ఆస్ట్రేలియా తోక ముడుస్తుందా ?

VAMSI
టీ 20 వరల్డ్ కప్ అనంతరం ఇండియా ప్రదర్శన రోజు రోజుకీ మెరుగుపడుతూ ఉంది. ఇటీవల ముగిసిన కివీస్ తో సిరీస్ లోనూ పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. కాగా ఇప్పుడు వన్ డే మరియు టీ 20 ఫార్మాట్ ల నుండి టెస్ట్ ఫార్మాట్ కు టర్న్ అవుతోంది. ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన నాలుగు టెస్ట్ ల బోర్డర్ గవాస్కర్ ట్రోపీ ఫిబ్రవరి 9 నుండి నాగ్ పూర్ వేదికగా స్టార్ట్ కానుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సీరీస్ మీదనే కేంద్రీకృతం అయింది. ఇండియా గడ్డపై ఆస్ట్రేలియాకు సీరిస్ ను గెలవడం అంత సులభం కాదు. ముఖ్యంగా స్పిన్ కు కంచు కోట అయిన ఇండియా పిచ్ లపై ఆస్ట్రేలియా ఆటగాళ్ళు గెలవడం కష్టమే.
ఇండియా టీమ్ లో కనగారూల బ్యాటింగ్ ను నిలువరించగల బెస్ట్ స్పిన్నర్లు ఉన్నారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉపఖండం పిచ్ లపై ఎంతలా చెలరేగి వికెట్లు తీస్తాడు అన్నది తెలిసిందే. ఆఫ్ స్పిన్, లీగ్ స్పిన్ , గూగ్లీ ఇలా రకరకాల బంతులను సందించడంలో అశ్విన్ దిట్ట. లెఫ్ట్ హ్యాండెడ్ ఆటగాళ్లు అశ్విన్ బంతులను ఆడడంలో చాలా ఇబ్బంది పడతారు. అశ్విన్ కు పిచ్ అనుకూలిస్తే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తాడు. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి.. గాయంతో కొంతకాలం పాటు అంతర్జాతీయ క్రికెక్ కు దూరమైన జడేజా రంజీ లో ఆడి 7 వికెట్లు తీసి సౌరాష్ట్ర జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియా టీమ్ లో స్మిత్, లబుచెన్, కామెరూన్ గ్రీన్ లను బోల్తా కొట్టించడానికి జడేజా తన అస్త్రాలతో సిద్దంగా ఉన్నాడు. ఆ తర్వాత మనము చెప్పుకోవలసింది లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి... గతంలో ఫామ్ ను కోల్పోయి మళ్ళీ జట్టులోకి రావడానికి చాలా కాలం కష్టపడ్డాడు. ఇప్పుడు నిలకడగా వన్ డే లు మరియు టీ 20 లలో రాణిస్తూ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యలా మారాడు. ఇతను కనుక జట్టులో చోటును దక్కించుకుంటే మాత్రం ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు. మరి చూద్దాం ముగ్గురితో కూడిన ఇండియా స్పిన్నర్లు ఆస్ట్రేలియాను ముప్పతిప్పలు పెడతారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: