నేపాల్ జట్టు హెడ్ కోచ్ గా.. టీమిండియా మాజీ ప్లేయర్?

praveen
ఇటీవల కాలంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇక తమ జట్టును మరింత పటిష్టవంతంగా మార్చుకునేందుకు .. అంతేకాదు పూర్వవైభవాన్ని కోల్పోయిన జట్లు ఇక మళ్లీ ప్రపంచ క్రికెట్లో రాణించేందుకు ఇక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే జట్టులో ఆటగాళ్ల విషయంలో ప్రక్షాళన చేపడుతూ ఉండడమే కాదు..  ఇక కోచింగ్ సిబ్బంది విషయంలో కూడా ఎంతో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇలా గత కొంతకాలం నుంచి చూసుకుంటే ప్రపంచ క్రికెట్లో మేటి జట్లుగా కొనసాగుతున్న టీమ్స్ దగ్గర నుంచి చిన్న జట్లుగా కొనసాగుతున్న టీమ్ వరకు కూడా కోచింగ్ సిబ్బందిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ్ అని చెప్పాలి.

 అయితే గత కొంతకాలం నేపాల్ క్రికెట్లో షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఏ ఫార్మాట్లో మ్యాచ్ ఆడినా కూడా నేపాల్ జట్టు ప్రత్యర్థి  చేతిలో చిత్తుగా ఓడిపోవడం జరుగుతూ వస్తుంది అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఇక నేపాల్ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా జట్టు ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో నేపాల్ క్రికెట్ బోర్డు ఇక జట్టును పటిష్టవంతంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతుంది  ఈ క్రమంలోనే ఇటీవల తమ జట్టు కోసం కొత్త హెడ్ కోచ్ ను నియమించింది అన్నది తెలుస్తుంది.

 నేపాల్ క్రికెట్ టీం హెడ్ కోచ్గా ఇండియాకు చెందిన మాజీ ప్లేయర్ మాంటి దేశాయ్ ఎంపికైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు నేపాల్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. కాగా గతంలో మాంటి దేశాయ్ వారం రోజుల పాటు నేపాల్ జట్టుకు కోచ్ గా బాధితులు చేపట్టారు అని చెప్పాలి. అంతేకాకుండా వెస్టిండీస్ టీం కి కూడా కోచింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇక గతంలో పలు ఐపీఎల్ జట్లకు కూడా ఇలా కోచ్గా వ్యవహరించారు మాంటి దేశాయ్. ఇక ఇప్పుడు నేపాల్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్గా ఎంపికైన ఆయన ఆ దేశ క్రికెట్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: