వైరల్ : డ్రెస్సింగ్ రూమ్ లో.. యూసుఫ్ పఠాన్ రచ్చ?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ ఆటగాళ్లు ఇతర దేశాలకు సంబంధించిన టి20 లీగ్లలో ఆడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం యూఏఈ టి20 లీగ్ లో కూడా భారత సీనియర్ ఆటగాళ్లు భాగం అయ్యారు అని చెప్పాలి. ఇక రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికి బీసీసీఐతో ఉన్న సంబంధాలను తెంచుకున్న విధ్వంసకర హిట్టర్ యూసఫ్ పటాన్ సైతం ప్రస్తుతం యూఏఈ టి20 లీగ్ లో ఆడుతూ ఉన్నాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు యూసుఫ్ పఠాన్.

 యూసుఫ్ పఠాన్ ఆడుతున్నాడు అంటే చాలు అతని నుంచి దాదాపు ఒక అద్భుతమైన ప్రదర్శనను ఆశిస్తూ ఉంటారు అభిమానులు. కానీ ఎందుకో యూసుఫ్ పటాన్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. బ్యాటింగ్లో మెరుపులు ఎక్కడ కనిపించడం లేదు. అదే సమయంలో బౌలింగ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు.  ఇటీవల  డిసర్ట్ వైపర్స్ తో జరిగిన మ్యాచ్ లో పటాన్ బౌలింగ్లో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్లు చీల్చి చెండాడారు. ఒకే ఓవర్ ఐదు సిక్సర్లు బాది మ్యాచ్ స్వరూపన్నే మార్చేసాడు ఓ బ్యాట్స్మెన్. ఇక నాలుగు ఓవర్లలో ఏకంగా 48 పరుగుల సమర్పించుకున్నాడు యూసుఫ్ పఠాన్.

 అయితే ఈ మ్యాచ్ లో తన బౌలింగ్ వైఫల్యం నేపథ్యంలో తీవ్ర అసంతృప్తి చెందాడు యూసుఫ్ పఠాన్. ఇక ఈ అసహనాన్ని మొత్తం డ్రెస్సింగ్ రూమ్ లో తోటి ఆటగాళ్లపై చూపించాడు. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళగానే నీ ఓవర్ వల్లే మ్యాచ్ కోల్పోయామని తోటి ఆటగాళ్లు నిందించారు అంటూ ఆరోపణలు చేసాడు. ఈ క్రమంలోనే తన బ్యాగ్స్ సర్దుకుని వెళ్ళిపోతున్నట్లుగా నానా రచ్చ చేసాడు. అయితే సహచర ఆటగాళ్లు మేనేజ్మెంట్ ఎంత వారిస్తున్నప్పటికీ వినకుండా బ్యాక్ భుజాన వేసుకొని రెండు అడుగులు ముందుకు వేస్తాడు. దీంతో ఏం చేయాలో అక్కడున్న వారికి అర్థం కాలేదు. ఇంతలో యూసుఫ్ పఠాన్ ఒక్కసారిగా పగలబడి నవ్వాడు. ఇది ఒక ఫ్రాంక్ అని సీక్రెట్ రివీల్ చేశాడు. దీంతో అక్కడున్న వారందరూ కాస్త అయోమయానికి లోనయ్యారు. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: