వరల్డ్ కప్: కివీస్ ను చిత్తు చేసి ఫైనల్ చేరిన ఇండియా !

VAMSI
జనవరి 14 వ తేదీ నుండి సౌత్ ఆఫ్రికా వేదికగా మహిళల అండర్ 19 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూప్ లుగా విడిపోయి తమ పోరాటాన్ని ప్రారంభించారు. మొదట లీగ్ మ్యాచ్ లు మాత్రం నాలుగు గ్రూప్ లుగా విడిపోయి అడ్డాగా.. అందులో నుండి సూపర్ 12 కు అర్హత సాధించిన జట్లు మరో రెండు గ్రూప్ లుగా విడిపోయి ఆడారు. ఇక చివరికి సెమీఫైనల్ కు అర్హత సాధించిన జట్లలో ఇండియా , న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు మొదటి సెమీఫైనల్ ఇండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది.
కీలకమైన ఈ సెమీఫైనల్ పోరులో మొదట టాస్ గెలిచిన ఇండియా విమెన్ కెప్టెన్ షఫాలీ వర్మ బౌలింగ్ ను తీసుకుంది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ మహిళలు ఆరంభంలో ఓపెనర్లను స్వల్ప స్కోర్ కే కోల్పోయినా ఎక్కడా తగ్గకుండా ఇండియా బౌలర్లపై విరుచుకు పడ్డారు. ప్లిమ్మెర్ (35) మరియు యిజ్జీ గేజ్ (26) లు వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడానికి ప్రయత్నించారు. అయితే ఇండియా బౌలర్లు వారిని కట్టడి చేసి త్వరగా పెవిలియన్ బాట పట్టారు. వీరిద్దరూ అవుట్ అయ్యాక కివీస్ ఇన్నింగ్స్ పూర్తిగా గాడి తప్పింది. ఒక దశలో కనీసం 100 పరుగులు అయినా చేస్తుందా అనిపించింది. కానీ ఒక్కో పరుగు జత చేస్తూ నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇండియా బౌలర్లలో పార్షవి చోప్రా మూడు వికెట్లు సాధిచి కివీస్ ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం పరుగుల లక్ష్య ఛేదనతో వచ్చిన ఇండియాకు కూడా షెఫాలీ వర్మ (10) వికెట్ రూపంలో షాక్ తగిలింది. కానీ ఆ తర్వాత కివీస్ కు ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా శెరావత్ (61) మరియు సౌమ్య తివారీలు (22) ఆచితూచి ఆడుతూ జట్టును విజయం వైపు నడిపించారు. ఓపెనర్ గా వచ్చిన శెరావత్ అద్భుతమైన ఫామ్ ను అర్ధసెంచరీ తో మరోసారి కొనసాగించింది. మరో 34 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సెమీఫైనల్ లో కివీస్ పై విజయాన్ని సాధించి ఫైనల్ కు చేరుకుంది. రెండవ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా లు తలపడనున్నాయి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: